ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మదనపల్లిలో జరిగింది. ఈ విషయం మదనపల్లిలో కలకలం లేపింది. భార్య పిల్లల్ని కాదని భర్త మరో మహిళతో వెళ్లిపోవడంతో, ఆవేదనకు గురైన మహిళా ఈ దుర్ఘటనకు పాల్పడింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేసిన పట్టించుకోలేదన్నమనస్థాపనతో 3పేజీల సూసైడ్ నోట్ రాసింది. బిడ్డలకు విషంతాగించి, ఆపై ఆమె విషంతాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బెంగళూరు రోడ్డు, చిప్పిలిలో కాపురం వుండే బాధితులు నాగమణి (29), ఆమె ఇద్దరి కుమార్తెలు పుష్పావతి (11), వైశాలి (9) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్తానికులు గుర్తించి జిల్లాఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.