రోడ్డు ప్రమాదంలో ముగ్గరి మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గరి మృతి
తిరుపతి -చెన్నై హైవేపై నగిరి మండలం రామాపురం వద్ద ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి వెళుతున్న ఇటియోస్ ట్రావెల్స్ కారును పుత్తూరు వైపు నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి, పక్కన పొదల్లోకి లాక్కొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో చనిపోయారు. కారు డ్రైవర్ ఇలంగోవన్ (20) మద్దూర్ , తిరుత్తని తాలూకా తమిళనాడు, నాగజ్యోతి (30) సింగపూర్ ,యువరాజన్ (42) సింగపూర్ మృతి చెందారు. శవాలను నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.