19, ఫిబ్రవరి 2024, సోమవారం

పూతలపట్టు టీడీపీ టిక్కెట్టు రేసులో ఆనగల్లు మునిరత్నం

 




తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, జాతీయ ఉద్యమ నేత, స్వచ్ఛంద సంస్థ సేవకుడు ఆనగల్లు మునిరత్నం పూతలపట్టు  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్టు రేసులో ఉన్నారు. అనూహ్యంగా అయన అభ్యర్థిత్వం తెరమీదకు వచ్చింది. నియోజకవర్గంలోని  పలువురి నాయకుల పనితీరు, బయోడేటాను పరిశీలించిన పార్టీ అధిష్టానం ఆనగల్లు మునిరత్నం బయోడేటాను ఫ్యానల్ లో  పెట్టారని సమాచారం. నియోజకవర్గంలో దళిత నాయకులతోపాటు ఇతర పార్టీ నాయకులకు కూడా మునిరత్నంకు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ రాష్ట్ర  ప్రముఖ నేతలు మునిరత్నం కు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. అయన పేరు ఖరారు కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.




పూతలపట్టుకు చెందిన ఆనగల్లు మునిరత్నం మాజీ శాసనసభ్యుడు బంగ్ల ఆర్ముగం స్వయాన సోదరుడు  బంగారు స్వామి కుమారుడు. ఎం ఏ చదివిన మునిరత్నం బి.ఎల్; డి ఫార్మసీ కూడా చదువుకున్నారు. చిన్ననాటి నుండి రామారావు వీరాభిమాని గా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో పనిచేస్తున్నారు. 1982 వ దశకంలో నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా పూతలపట్టుకు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికి, ఆనాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. క్రమంగా మండలంలో పట్టు సాధించుకుంటూ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసి, సఫలీ కృతులయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. 2021 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో శ్రీకాళహస్తి రూరల్ మండలంలో 10 క్లస్టర్ బూతులు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎనిమిది, తొమ్మిదవ వార్డులకు పరిశీలకుడి గా వ్యవహరించారు. ఆయన 1994లో వేపంజేరి నియోజకవర్గం శాసనసభ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పార్టీలో ప్రవేశించారు. మూడుసార్లు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు.




1985లో నాదెండ్ల  భాస్కరరావు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేచినప్పుడు రామారావుకు మద్దతుగా పూతలపట్టులు మహా ధర్నాలో  పాల్గొన్నారు. అప్పట్లో పోలీసులు కాల్పులు నుండి త్రుటిలో తప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ఇతని మీద మూడుసార్లు హత్య ప్రయత్నం చేశారు. తనమీద, తన అనుచరుల మీద పలు ఆక్రమ కేసులను బనాయించి వేధించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నందున, కాంగ్రెస్ పార్టీ నాయకులు 3.6 ఎకరాల వ్యవసాయ భూమి స్వాధీనం చేసుకొని, ఆ భూమిలో ఇంటర్ కళాశాలను నిర్మించారు.



2009 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అంతకుముందు ఏకపక్షమైన గొడుగు చింత గ్రామపంచాయతీలో టిడిపికి 360 ఓట్లు పోలు కావడంతో గ్రామస్తులు 150 దళిత కుటుంబాలను గ్రామం నుండి బహిష్కరించాయి. ఆ కుటుంబాలను పనిలోకి రాకుండా చేయడంతో ఆ గ్రామానికి నిత్యవసర వస్తువులు, జంతువులకు దానా, నీళ్ళు దగ్గర ఉండే ఏర్పాటు చేశారు.  1999, 2004, 2009, 2019 ఎన్నికల్లో కూడా మునిరత్నం టిడిపి టికెట్ ఆశించారు. టిక్కెట్ రాకున్నా టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం పని  చేశారు.



రాజకీయాలతో పాటు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో కూడా మునిరత్నం చాలా సురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన చిత్తూరు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (కోవా) కార్యదర్శిగా, సమగ్ర భూమి అభివృద్ధి పథకం జిల్లా కన్వీనర్ గా, జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా కన్వీనర్ గా, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ (PMC) రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ బాలల కార్మికుల పాఠశాల నిర్వహించారు. చెన్నైకి చెందిన ఇండియా సోషల్ వర్కర్స్ ఆర్గనైజేషన్ జాతీయ చైర్మన్ గా, హైదరాబాదుకు చెందిన జాతీయ దళిత ఫోరం రాష్ట్ర కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ దళిత సోషల్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ గా, తమిళనాడులోని చిదంబరం కు చెందిన సాక్య వనగర్ ట్రస్టు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే తమిళనాడుకు చెందిన సాక్య దళిత ఫౌండేషన్ ఉపాధ్యక్షుడిగా, పుదుచ్చేరికి చెందిన ఆల్ ఇండియా తమిళ పరైయర్ ఫోరం ఉపాధ్యక్షుడిగా, మలేషియా కు చెందిన ఇంటర్నేషనల్ పరైయర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. మునిరత్నం జాతీయస్థాయిలో మహిళా సాధికారత, మానవ హక్కుల పైన శిక్షణా తరగతులను నిర్వహించారు. 



అలాగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల మీద, సహజ వనరులు జీవనోదపాధిపై కూడా శిక్షణ ఇచ్చారు. జిల్లాస్థాయిలో పలు అంబేద్కర్ విగ్రహాలను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. పూతలపట్టు, గొడుగుచింత, తిప్పనపల్లి,  ఐరాల మండలం పాటూరు సంత గేటు, బంగారుపాలెం మండలం నలగాంపల్లి, నారాయణవనం మండలం బ్రాహ్మణ తంగాల్ లలో  అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పలువురు మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధికి కృషి చేశారు.



 తమిళ మాల సామాజిక వర్గానికి చెందిన మునిరత్నంకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. ఆయన కోసం శ్రమించే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయంగా తాను చేసిన కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, దళిత మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉద్యమాలు, సారాయి ఉద్యమాలు చేసిన నేపథ్యంలో తనకు అండగా నిలుస్తాయని మునిరత్నం భావిస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గం లో కూడా పార్టీకి ప్లస్ అవుతుందని తెలిపారు. రాజకీయంగా ఉంటూ, సమాజ సేవ చేస్తూ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిన తనకు టికెట్ ఇస్తే గెలిసి చంద్రబాబుకు పూతలపట్టును బహుమతిగా ఇస్తానని మునిరత్నం ధీమాను వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *