14, మార్చి 2023, మంగళవారం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

                        రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

       


          చిత్తూరు తిరుపతి రహదారిలోని పాలకూర వద్ద మంగళవారం ఉదయం జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.  ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన,  గాయపడ్డ వారు బెంగళూర్ వాస్తవ్యులుగా తెలుస్తుంది.  వీరు తిరుమల దర్శనం బెంగళూరుకి వెళుతుండగా ఈ దుర్ఘటన  జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుకవైపు నుండి   లారీ  డికొనడంతో ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం పాలకూరు  NH140 జాతీయ రహదారి మీద దుర్ఘటన జరిగింది. గాయపడ్డ వారిని హుటా హుటిన 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి  పూతలపట్టు  ఎస్ఐ, పోలీసులు తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు  పూతలపట్టు S.I. హరి ప్రసాద్ తెలిపారు.

         


         బెంగళూరు తిరుపతి జాతీయ రహదారి పై కారును వెనుక నుండి లారీ ఢీకొట్టిన ఘటనా స్థలాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి ఆదేశానుసారం చిత్తూరు SDPO శ్రీనివాస మూర్తి  వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆక్సిడెంట్ కు గల కారణాలను తెలుసుకోవాలని, మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేయాలని పూతలపట్టు S.I.  హరి ప్రసాద్ కు  ఆదేశాలు జారిచేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *