28, మార్చి 2023, మంగళవారం

కోనేరులోకి దిగి ముగ్గురు బాలికలు మృతి

  కోనేరులోకి దిగి ముగ్గురు బాలికలు మృతి


         చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. కాలభైరవస్వామి ఆలయ కోనేరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గౌతమి, మౌనిక, భవ్యలుగా గుర్తించారు. ఇద్దరు బాలికలు గౌతమి మౌనిక తొమ్మిదవ తరగతి చదువుతుండగా, భవ్య ఇంటర్ చదువుతోందని సమాచారం.  సంఘటనా స్థలం వద్ద కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే...

             బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి కోనేరులో దిగిన ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. దేవదొడ్డి గ్రామానికి చెందిన కదిరివేలు కుటుంబం తమ బంధువులతో కలిసి ఆ గ్రామంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయానికి పూజల కోసం వెళ్లారు. కదిరివేలు కుమార్తె గౌతమి.. తమ బంధువులు మౌనిక, భవ్యలతో కలిసి సమీపంలోని కోనేరు వద్దకు వెళ్ళి సరదాగా ఆడుకుంటున్నారు. అయితే ప్రమాదవశాత్తూ వారు ముగ్గురూ నీటిలో మునిగిపోయి మృతి చెందారు.


       తల్లిదండ్రులు ఆలయంలో దేవునికి నైవేథ్యం పెడుతున్న సమయంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత పిల్లలు కనబడకపోవటం గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. అయితే ముగ్గురు పిల్లలు కోనేటిలో ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం పిల్లలను కోనేటిలో నుంచి బయటకు తీసి హుటాహుటిన బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పిల్లలను పరీక్షించి వైద్యలు.. అప్పటికే వారు మృతి చెందినట్లు తెలిపారు.

         మౌనిక, భవ్య ఇద్దరూ తమిళనాడు రాష్ట్రంలోని పేర్నంపట్టుకు చెందిన ఆరవట్ల గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో గౌతమి, మౌనిక ఇద్దరి వయస్సు 14 సంవత్సరాలు. కాగా.. భవ్యకు 16 సంవత్సరాల వయస్సు ఉంటుందని సమాచారం. ఈ విషాదకర ఘటనతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *