2,986 బస్తాల రేషన్ (PDS) బియ్యం స్వాధీనం
2,986 బస్తాల రేషన్ (PDS) బియ్యం స్వాధీనం
పేద ప్రజలకు పంపిణీచేయవలసిన రేషన్ బియ్యమును “బోలేరో” వాహనముల ద్వారా సత్తెనల్లి మండలం కోమెరపూడి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్ రైస్ మిల్ లోనికి అక్రమంగా తరలిస్తున్నారనివిశ్వ్ససనీయ సమాచారం మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం అర్థరాత్రి గుంటూరు జిల్లా సత్తెనల్లి మండలం కొమెరపూడి శ్రీ విఘ్నేశ్వర రైస్ మిల్ కు కొద్ది దూరంలో నిఘా వేసి ఉన్నారు. 3 బొలెరో వాహనాలు లోడుతో రైస్ మిల్లులోనికి ప్రవేశించే సమయంలో సదరు వాహనమును వెంబడించి మిల్లు లోనికి వెళ్ళి బస్తాలు దింపుతుండగా పట్టుకొని తనిఖీలు చేపట్టారు. మొదటి వాహనంలో 80 బస్తాల PDS ముద్రలు కలిగిన బియ్యం బస్తాలు, రెండవ వాహనంలో 20 P.D.S. ముద్రలు గల బియుం బస్తాలు, 40 తెల్ల ప్లాస్టిక్ సంచులు, మూడవ వాహనంలో 60 ప్లాస్టిక్ సంచులలో బియ్యం కనుగొన్నారు.
మిల్లులో తనిఖీ చేయగా 2786 బస్తాలు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. మిల్లులోని 2786 బస్తాలలోని బియ్యము, మరియు 3 వాహనాలలో 200 బస్తాలు కలిపి 2986 బస్తాలలో 1493 క్వింటాళ్ళ PDS బియ్యం తో పాటు వాహనములనూ స్వాధీన పరచుకొన్నారు. మిల్ ఆనుకొని ఉన్న గదిలో సివిల్ సప్లైస్ P.D.S. ముద్రలు కలిగిన 4000 పైగా ఖాళీ గోతాలు కూడా స్వాధీన పరుచు కొన్నారు. నిత్యావసర సరుకుల చట్టం క్రింద 6-A కేసుతో పాటు మిల్లు యజమాని కల్లం గంగాధర రెడ్డి, పై తెలిపిన వాహనముల యజమానులు మరియు డ్రైవర్ లపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయ వలసినదిగా స్థానిక సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దారు వారిని విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. పై తనిఖీలలో విజిలెన్స్ D.S.P. శ్రీనవాస రావు, తహసిల్దార కె.నాగమల్లేశ్వర రావు, సిఐ ఏ.శ్రీహరి రావు, ఎస్ఐ ఎం.రామ చంద్రయ్య, స్పెషల్ స్క్వాడ్ ఎస్ఐ వేంకట కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.