22, మార్చి 2023, బుధవారం

మద్యంఅక్రమంగా తరలించే వారికి శుభవార్త

 మద్యంఅక్రమంగా తరలించే వారికి శుభవార్త 



           అక్రమంగా మద్యం బాటిళ్లు తరలించే వారికి ఓ రకంగా శుభవార్త. ఇకపై పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలతో పట్టుబడిన భయపడనవసరం లేదు, అయితే ఓ షరతు పెట్టారు, అందుకు జరిమాన మాత్రం చెల్లించాలి. అది కూడా తొలిసారిగా మాత్రమే నేరానికి పాల్పడితే, చట్టంలో తెలిపిన ప్రకారం జరిమాన చెల్లించి కేసును పరిష్కరించుకోవచ్చు. ఇందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు బిల్లుల్ని తీసుకొచ్చింది. అయితే ఈ కేసుల్లో జప్తు చేసిన వాహనాలు, ఆస్తులకు సంబందింతి అధికారులు నిర్ధారించిన విలువ మొత్తాన్ని చెల్లిస్తే తిరిగి ఆ వాహనాలు పొందచ్చును. అయితే ఈ కేసులు అంత తీవ్రత లేనివై ఉండాలని ఈ చట్టంలో తెలుపబడింది.


               అయితే మద్యం కూడా అధిక మొత్తంలో మద్యం తీసుకువెళ్తే ఈ చట్టం వర్తించదు. తక్కువ మొత్తంలో మద్యంతో పట్టుబడి ఉండాలి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టం 1968 సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్యం నిషేధ చట్టం 1995 సవరణ బిల్లులను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వాటిని సభ కూడా ఆమోదించింది. ఈ సవరణల ప్రకారం జరిమాన విధించే, జప్తు చేసిన వాహనాలను విడుదల చేసే అధికారాలు, జిల్లా కలెక్టర్, సెబ్ ఎక్సైజ్ అధికారులుకు దఖలు పడతాయి. పన్ను చెల్లించని మద్యంతో చిక్కిన వారు పర్మిషన్ లేకుండా మద్యం అమ్మకాలు చేస్తూ దొరికిన వారికి గరిష్టంగా 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 5 లక్షల వరకు జరిమానా విధించేలా 2020 లో చట్ట సవరణ చేశామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారువీటికి సంబంధించి 2020, 2021 సంవత్సరంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య అధికమై పనిభారం పెరిగిందని తెలిపారు, అందుకే ఈ కేసుల్లో తీవ్రత లేని, తీవ్రత ఎక్కువగా ఉన్నవిగా విభజించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తీవ్రమైనా నేరాల దర్యాప్తుపై దృష్టి పెట్టాలని తెలిపారు. తీవ్రత లేని కేసుల్లో తొలిసారి నేరానికి పాల్పడిన వారికి రాజీకి వీలు కల్పిస్తున్నామని తెలిపారు. దీని వల్ల దర్యాప్తు సంస్థలు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుiల సంఖ్య తగ్గుతుందని నారాయణ స్వామి బిల్లు ఉద్దేశాలు కారణాలులో వివరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *