21, మార్చి 2023, మంగళవారం

ఈ సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది

ఈ సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది

తెలుగు వారి తొలి పండుగ 

ప్రతి ఇంటా ఉగాది పచ్చడి  

        ఉగాది (Ugadi) రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని ప్రజలు బలంగా నమ్ముతారు. ప్రభావ నామా ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడవ బ్రహ్మ, బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు. పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు.తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి, తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని ప్రజలు నమ్ముతారు. అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారని తెలుగు ప్రజలు నమ్ముతారు. తెలుగు వారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తోంది. తిథి , వార, నక్షత్ర.యోగం, కరణాలను అనే ఈ ఐదింటిని వివరించేదే  పంచాంగ శ్రవణం.

       


  తెలుగు వారు  ఎంతో ఇష్టంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది( Ugadi).ఈ పండుగ తోనే తెలుగువారి పండుగలు ప్రారంభం అవుతాయి.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను పిలుస్తూ ఉంటారు. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి ఉగాది రోజు ఉగాది. జనవరి 1న తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగు ప్రజలు మాత్రం ఉగాది రోజున కొత్త సంవత్సరంగా భావిస్తారు.ఇంకా చెప్పాలంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.  యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము.యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది.మరోలా వివరించాలంటే ఉగాది అనగా “ఉ” అంటే నక్షత్రము అని , “గా “అనగా గమనం అంటే నక్షత్ర గమనము ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం. 

         ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది.ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు.ఈ పండుగను మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్ లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు. ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి , దేవుడికి పూజ చేస్తారు. దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్బంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సంభ్యులందరు దానిని తీసుకుంటారు. ఇంకా పిండి వంటలు, పోలిలు  ప్రత్యేకంగా చేసుకుంటారు.

       ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచుల (తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు) సమ్మేళనంతో తయారుచేస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తరువాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగాని తక్కువగాని అవకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు.





అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *