ఆంధ్ర ప్రభతో జిల్లా మైనారిటీ పరిచక్షణ శాఖ అధికారి హరినాథ్ రెడ్డి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రపభ,
చిత్తూరు జిల్లాలోని మైనార్టీల అభివృద్ధి, స్వయం ఉపాధికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 14 కోట్ల రూపాయలతో 916 యూనిట్లను మంజూరు చేసిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాణిపాకం హరినాథ్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ లబ్ధిదారులు ఓబిఎంఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైనార్టీ కార్పొరేషన్ కింద నాలుగు స్లాబ్ లలో ఈ పథకాలు మంజూరయ్యాయని తెలిపారు. స్లాబ్ 1 లో యూనిట్ ధర లక్ష రూపాయలుగా నిర్ణయించారని, స్లాబ్ 2లో యూనిట్ ధర లక్ష రూపాయలు నుంచి 3 లక్షల రూపాయలుగా నిర్ణయించామన్నారు. స్లాబ్ 3 లో యూనిట్ ధర మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలుగా, స్లాబ్ 4లో యూనిట్ ధర 8 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు వివరించారు. ఇందులో బ్యాంకులను 50 శాతం రుణంగా అందజేస్తాయని, ప్రభుత్వం సబ్సిడీగా 50 శాతం ఇస్తుందని హరినాధ రెడ్డి వివరించారు. స్లాబ్ 1 లో కిరాణా షాపు, పాన్ షాప్, చికెన్, మటన్ షాపులు, పళ్ళ దుకాణాలు, కూరగాయల దుకాణాలు విద్యుత్ ఉపకారణాల రిపేర్లు సైకిల్ షాపులు తదితరాలను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. స్లాబ్ రెండులో ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్లు, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్లు, బ్యాటరీ సర్వీసింగ్, సేల్ సెల్ ఫోన్ దుకాణాలు, పాదరక్షల దుకాణాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ వంటివి నెలకొల్పుకోవచ్చని తెలిపారు. స్లాబ్ త్రీలో ఆటోమొబైల్, రవాణా, ఫ్యాబ్రికేషన్ తదితీరాలు వస్తాయని, స్లాబ్ 4 కింద ఆటో మొబైల్ యూనిట్స్, జనరిక్ మెడికల్ షాపులు, ఫిట్నెస్ సెంటర్లు వస్తాయని తెలిపారు. చిత్తూరు జిల్లాకు స్లాబ్ వన్ కింద 695 యూనిట్లు, స్లాబ్ రెండు కింద 140 యూనిట్లు, స్లాబ్ త్రీ కింద 71 యూనిట్లు, స్లాబ్ 4 కింద 10 యూనిట్లు మొత్తము 916 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో బ్యాంకులు రుణంగా 7. 04 కోట్ల రూపాయలు ఇస్తాయని, సబ్సిడీ కింద ప్రభుత్వం మరో 7.04 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని అన్నారు. మొత్తం మొత్తం యూనిట్లకు 14. 09 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. జిల్లాలో ముస్లింలు క్రిస్టియన్, బుద్ధులు జైన్లు పారసీకులు ఈ యూనిట్లు నిమిత్తం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ఓబి ఎంఎంఎస్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, అభ్యర్థులు ఆధార కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫోటో సెల్ ఫోన్ నంబర్లతో దరఖాస్తు చేసుకోవచ్చని హరినాద్ రెడ్డి వివరించారు. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.