పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేన అధినేత
పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేన అధినేత
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పొత్తుల జనసేన అదినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. రానున్న ఎన్నికలలో BJPతో పొత్తు ఉండదని తేల్చి పారేశారు. YSR కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. తను ఎంత కలిపోడం అనుకున్నా, స్తానిక BJP నాయకులు కలిసి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు అని BJPని ఉద్దేసించి ఘాటుగానే విమర్శించారు. హైదారాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటే, నువ్వు ఆంధ్ర వాడివి ఇక్కడ ఎలా పోటీ చేస్తామని స్థానిక బిజెపి నాయకులు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా వాళ్ళ ఓట్లు కావాలి, కానీ పోటీ చేయొద్దంటే ఎలా? అని BJP పెద్దలను నిలతేసారు.
నేను బిజెపికి అండగా నిలబడ్డా, వాళ్ళే కలిసి రావడం లేదు. కలుపుకొని వెళ్ళడం లేదని BJP నేతల ఒంటెద్దు పోకడల్ని ఎందకట్టారు. ఢిల్లీలో బిజెపి జాతీయ నాయకులు చెప్పినదానిని స్థానిక నాయకులు అమలు చేయడం లేదని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో పొత్తు ఎలా కోనసాగుతుందని ప్రశ్నించకనే ప్రశ్నించారు. అనుకున్న ప్లాన్ BJP వాళ్ళు అమలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ (TDP)తో పొత్తు అవసరం ఉండేది కాదన్నారు. టిడిపిపై తనకు ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సమర్థులన్న గౌరవం మాత్రం ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని పరిశీలిస్తే త్వరలో BJPతో పొత్తు కట్ అవుతుందని అర్థం అవుతుంది. రాష్ట్ర శ్రేయస్సు దృష్టే TDPతో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో YCPని ఓడించడమే పవన్ కళ్యాణ్ ధ్యేయంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆవేదన మంగళవారం మచిలీపట్నంలో జరిగిన 10వ ఆవిర్భావ సభలో అయన మాటల్లోనే చదవండి...
" నేను వైకాపా (YSR కాంగ్రెస్ పార్టీ) వ్యతిరేక ఓటు అన్నానంటే దానికి కారణాలు ఉన్నాయి. పొత్తు పెట్టుకుని మేం అనుకున్న ప్లాన్ అమలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ (TDP) అవసరం లేకుండానే ఎదిగే వాళ్ళం. అమరావతి రాజధాని అని చెప్పి లాంగ్ మార్చ్ చేద్దామనుకున్నాం. ఢిల్లీలో బిజెపి జాతీయ నాయకుల దానికి అంగీకరించారు. కానీ ఇక్కడికి వచ్చాక బిజెపి స్థానిక నాయకులు అలాంటిదేమీ లేదన్నారు. బిజెపికి అండగా ఉంటానని నేను చెబుతుంటే, కలిసి కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకు రాకపోతే నేనేం చేయను? నేను నష్టపోవచ్చు గాని, నా రాష్ట్రం నష్టపోకూడదు. ప్రజలు నాకు అండగా లేకపోయినా, వారిని నేను వదలను. నేను అనుకున్నట్లు జనసేన, బిజెపి కార్యక్రమం జరిగి ఉంటే YSR కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును అనే మాట నా నోటి నుంచి వచ్చేది కాదు. టిడిపిపై నాకు ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన లేవు. చంద్రబాబు సమర్థులన్న గౌరవం ఉంది.
అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు అన్నట్లుగా ఉంది స్థానిక బిజెపి నాయకుల పరిస్థితి. వారు కలిసి రారు. నన్ను చేయనివ్వకపోతే ఎలా? దీన్ని బిజెపి జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాను. మేం తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటే, నువ్వు ఆంధ్ర వాడివి ఇక్కడ ఎలా పోటీ చేస్తామని స్థానిక బిజెపి నాయకులు అన్నారు. ఆంధ్రా వాళ్ళ ఓట్లు కావాలి, కానీ పోటీ చేయొద్దంటే ఎలా? అక్కడ మాకు అభిమానులు ఉన్నారు. నేను బిజెపికి అండగా నిలబడ్డా, వాళ్ళే ముందుకు తీసుకెళ్లడం లేదు...."