చిత్తూరు మార్కెటింగ్ మాజీ చైర్మన్ మృతి
చిత్తూరు మార్కెటింగ్ మాజీ చైర్మన్ వి.ఎస్ గుప్తా అకాల మరణం
చిత్తూరు మార్కెటింగ్ మాజీ V.S. సత్య నారాయణ గుప్త గురువారం ఉదయం 02.45 గంటలకు హైదరాబాదులో మృతి చెందారు. వీరి కుటుంబానికి ఆర్యవైశ్యులు సంతాపం తెలిపారు. వీరు చిత్తూరు పట్టణంలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. పేదలకు సహాయం అందించడంలోనూ రాజకీయాలలో చక్రం తిప్పడంలోనూ తనదైన శైలి ప్రదర్శించేవారు.
ఆయన గత 10 ఏళ్లుగా ఆర్య వైశ్య చిత్తూరు జిల్లా, అధ్యక్షులుగా, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ గా సేవలందించారు. శ్రీ సత్య సాయి సేవా సమితి, చిత్తూరు, పూర్వ కన్వీనర్ V. శ్రీ కంటయ్య పెద్ద కుమారు డు. వీరి వయసు 55 సం. వీరుకి భార్య, ఒక కుమారుడు. ఉన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ చిత్తూరు పట్టణానికి చెందిన పలు సంఘాల నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారంఉదయం 10 గంటలకు దహన క్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.