ఆశాలకు అదనపు పనులు చెప్పద్దు
ఆశాలకు అదనపు పనులు అప్పచెప్పద్దు
DMHO ఎదుట ఆశాలధర్నా
గ్రామీణ, పట్టణ పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశాలకు విలేజ్ క్లినిక్, సచివాలయంలో అదనంగా పనులు అప్పచెప్పకూడదని,పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా DH&HO ఆఫిసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా చేసి కోర్కెల పత్రాన్ని సంబంధించిన అధికారికి ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గంగ,అధ్యక్షురాలు కృష్ణవేణి కోశాధికారి పద్మ లు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ నియామకాలు ప్రభుత్వం ద్వారానే జరగాలని, ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కష్ట పడి పనిచేసే వారిని తొలగించి వారి స్థానంలో అధికార పార్టీ కి చెందిన వారిని నియమించడాన్ని ఆపాలని కోరారు. రూ పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌఖ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని వీరు డిమాండ్ చేశారు .సీఐటీయూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి చైతన్య ,కాంజీవరం సురేంద్రన్ లు మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనం రూ 26000 నిర్ణయం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రికార్డు లను ప్రభుత్వమే సరఫరా చేయాలని పని చేసే ఫోన్లు ఇవ్వాలని కోరారు. ధర్నా లో సుబ్బలక్ష్మి, గీత, నలిని,ప్రియ,వనజ,విజయ లతో బాటు వివిధ phc ల నుండి ఆశాలు పాల్గొన్నారు.