CPM, CPI ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
జీవో నెం 1 రద్దయేంతవరకు పోరాడుతాం.
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు హెచ్చరిక.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో ఎలాంటి ఆందోళన చేయకూడదని చీకటి జీవో ఒకటి తీసుకురావడం దుర్మార్గమని, దాని రద్దు చేయాలని సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహంవద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వామపక్షాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం పిలుపునివ్వగా కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని నిరసిస్తూ నిరసన తెలియచేసారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ బుద్ధి చెప్పిన దానిని గుణపాఠం తీసుకోకుండా ఉద్యమాలను అనుచడానికి ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ బాధలు చెప్పుకోవడానికి విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను, జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని వెళుతున్న వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వాలు కూడా ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపగా ఆ ప్రభుత్వాలను ఇంటికి పంపించిన పరిస్థితి వుంది. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలని లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీవో నెంబర్ ఒకటి రద్దయి ఎంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపి మహిళా సంఘం నాయకులు విజయ గౌరీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.