పట్టభద్రులకు, టీచర్లకు నోట్ల ఎర..!
పట్టభద్రులకు, టీచర్లకు నోట్ల ఎర..!
ఓటుకు రూ.5 వేలు
లక్షల ఓటర్లనే నోట్లతో కొట్టాం.... పరిమిత ఓటర్లే... పట్టభద్రులు, ఉపాధ్యావులు .....పైసలు వెదజల్లేద్దాం... పట్టేద్దాం... ఎగరేసుకు పోదాం.... పదవి కొట్టేద్దాం... గళాన్ని అమ్మేద్దాం... పెట్టుబడి రాబట్టేద్దాం.... ఆరేళ్లు అనుభవిద్దాం.... హాయిగా బ్రతికేద్దాం..... అన్న ఆలోచనతో అభ్యర్థులు వల వేస్తున్నారు... ఆదమరిచామో... ప్రలోభాలకు పడ్డామో... అంధకారమే... నిక్కచ్చైన... నికాసైన... విలువలకు అద్దం పట్టే నాయకున్ని ఎన్నుకొంటేనే పట్టభద్రుల భవిష్యత్ భద్రం.
లక్షల ఓటర్లు ఉన్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఓటును నోటుతో కొనగలిగాం...వేళ్ళ మీద లెక్కపెట్టే పరిమిత ఓటర్లు వున్న పట్టభద్రులను, ఉపాధ్యావులను ఎన్నికల్లో ఓట్లు కొనడం చాలా సులభమనుకుంటున్నారు. ఓటుకు ఎంతైనా చెల్లిద్దాం. మనకే ఓటు వెయ్యాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మండలాల వారీగా స్థానిక నాయకత్వంతో మంతనాలు జరిపారు. గ్రామ పంచాయితీల వారీగా ఓటరు జాబితాల్ని నాయకులకు చేరవేశారు. అధికార,ప్రతిపక్ష ఓటర్లు లెక్క తెలుసుకున్నారు.
ఓటుకు 4 వేల నుండి 5 వేలకు పైగా ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఓట్లు మనకే పడాలంటూ ఇరు పార్టీల నాయకులు వ్యూహరచన చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటరే విచక్షణతో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా నోట్ల మూటలు రాజ్యమేలుతున్నాయి. ధనం మేధావి వర్గాన్ని సైతం లొంగ తీసుకుంటుందనుటలో సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి.. గెలిచిన అనంతరం రెండింతలు ఆదాయం కోసం నాయకులు ఎంచుకుంటున్న మార్గాలు అందరికీ విధితమే. ఈ నేపథ్యంలో పట్టభద్రులు నోట్ల వలలో పడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించాలి. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నాయి. సర్వశక్తులు వోడ్డుతున్నారు. అన్ని రకాల ప్రలోభాల్ని ప్రయోగిస్తున్నారు.
వాటికి గురైతే.. ఓట్లను అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారు. పట్టభద్రుల ప్రయోజనాలు అటకెక్కుతాయి.పట్టించుకునే నాధుడే కరువైతాడు. పెట్టిన పెట్టుబడులపై నాయకులు దృష్టి పెడతారు. ఆరేళ్లు(6) హాయిగా అన్ని అనుభవిస్తారు. అసలైన లక్ష్యం గాలికి వదిలేస్తారు. ఏమీ చేయలేని దుస్థితి పట్టబద్రులది అవుతుంది. 2000, 3000, 4000, 5000 వేలు, అపైన నోట్లకు ఓటును తాకట్టు పెడితే, పట్టబద్రుల భవిష్యత్ చిత్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
విచక్షణతో...వివేకంతో అభ్యర్థుల ప్రలోభాలను తిప్పికొట్టాలి. ఓటు హక్కును నిక్కచ్చైన.... నికాసైన.. నీతి, నిజాయితీ పరులైన అభ్యర్థి ఎంపికకే వినియోగించాలి. అప్పుడే పట్టభద్రులకు విలువ ఉంటుంది. మేధావులు అమ్ముడుపోరన్న సంకేతాన్ని అభ్యర్థులకు రుచి చూపించాలి. సమాజానికి మంచి సందేశమివ్వాలి.
పట్టభద్రులు మేదావులు, ఉపాధ్యావులు, అమ్ముడుపోరని ఆశిద్దాం