14, మార్చి 2023, మంగళవారం

తిరుపతిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలి: TDP

 తిరుపతిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలి 

TDP నాయకులు డిమాండ్


      తిరుపతిలో  అన్ని బూతుల్లో రీపోలింగ్ జరిపించాలని,  కేవలం రెండు బూతులకే రీపోలింగ్ పరిమితం చేయటం అనేది దారుణం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పి సప్తగిరి ప్రసాద్ అన్నారు. Tirupathiలో  పుణ్యక్షేత్రం ఎన్నికల రోజు  రక్తక్షేత్రంగా మారిపోయిందనీ, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకి పోలీసు యంత్రాంగం దాసోహమైపోయిందని ఆవేదన చెందారు.

    డాక్టర్ పి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ...   తిరుపతి లో ప్రజాస్వామ్యం అపహస్యం పాలైంది. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సాక్షాత్తు ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నే ఎన్నికలు అపహాస్యం పాలైయిందని ప్రభుత్యనికి లేఖ రాశారు.  ప్రజాస్వామ్యం  ఖూనీ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకున్నదని చెప్పిందంటే ఈ రాష్ట్రంలో  పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఒకసారి అర్థం అయితుంది. కనీసం పదో తరగతి కూడా పాస్ కానీ అటువంటి వాళ్ళకి నకిలీ ఓట్లు నమోదు చేయించి వందలాది ఓట్లు వేయించడం దురదృష్టకరం. పోలీసుల సహకారంతో, పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పైన దాడి చేసి రక్త గాయాలు  చేస్తుంటే పోలీసులు కనీసం  చూసి చూడనట్లు ఉండటం విడ్డురం. తక్షణం తిరుపతిలో అన్ని పోలింగ్ బూత్ లో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. పత్రిక విలేకరుల సమావేశంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్స్ అధ్యక్షడు మేషాక్, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, వాణిజ్యవి భాగం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, టిడిపి నాయకులు ధరణి, జైపాల్ పాల్గొన్నారు.


 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *