వయనాడ్ MP సీటు ఖాళీ
రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు అనర్హుడే అవుతారు. అయితే, సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు నిలిపివేస్తే రాహుల్ గాంధీ పోటీలో ఉండొచ్చు.
ఒకవేళ, రాహుల్‌కు పై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ, హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. అయితే, పై కోర్టులో, సుప్రీంలో రాహుల్‌కు ఊరట లభించే విధంగా తీర్పు వస్తేనే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ మాజీ ఎంపీ అయిన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని కూడా ఖాళీ చేయమని ప్రభుత్వంఇప్పటికే నోటిసులు జారీ చేసింది.