పట్టభద్రులు జగన్ కు గుణపాఠం చెప్పారు: పట్టభద్రుల MLC కలిచెర్ల శ్రీకాంత్
మోసం చేసిన సీఎం జగన్ కు పట్టభద్రులు గుణపాఠం చెప్పారు
పట్టభద్రుల MLC కలిచెర్ల శ్రీకాంత్
ఇంకా అయన మాట్లాడుతూ... నా విజయానికి కారకులు,న న్ను ప్రోత్సహించిన నారా లోకేష్ కు నా విజయం అంకితం. నాకు వెన్నంటి వున్న టిడిపి కార్యకర్తలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు చేస్తున్నాను. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నిరుద్యోగులకు మోసం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి పట్టభద్రుల గుణ పాఠం చెప్పారు. వందలాది కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. వున్న పరిశ్రమలను వెళ్లకొట్టిన చరిత్ర వైసిపిది. ఆటో మొబైల్ క్లస్టర్ కింద కియా పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. విజన్ వున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని నమ్మి రాష్ట్ర రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇస్తే దానిని జగన్ వమ్ము చేశారు. CPS వారంలోపు రద్దు చేస్తానని అధికారం లోకి వచ్చిన జగన్ ఉద్యోగులను మోసం చేశారు. సీఎం జగన్ స్వంత జిల్లాలో టీడీపీకి అధిక ఓట్లు రావడం వైసీపీకి ప్రజల్లో వున్న వ్యతికేరతకు నిదర్శనం. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం తధ్యం. ఉపాధ్యాయ శాసనమండలి అక్రమాలతో వైసిపి గెలుపొందడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెంకీటిల సురేంద్ర కుమార్, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ మేయర్ కటారి హేమలత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తిదితరులు పాల్గొన్నారు.