16, మార్చి 2023, గురువారం

MLC ఓట్ల లెక్కింపు ప్రారంభం

 

MLC ఓట్ల లెక్కింపు ప్రారంభం 



             ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ RVS కాలేజ్ లో గురువారం  ఉ.8 గంటలకు ప్రారంభం అయ్యింది. ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు ఆర్ వి ఎస్ లా కాలేజీ లో ఎన్నికల పరి శీలకులు  కోన శశిధర్ ఐఏఎస్., పట్ట భద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికలపరిశీలకులు  ఎస్.హెచ్. భాస్కర్ కాటమ నేని ఐ ఏ ఎస్., రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 


        రిటర్నింగ్ అధికారి & జిల్లా కలెక్టర్, భారత ఎన్నికల సంఘం, న్యూఢిల్లీ వారిచే నియామకం కాబడ్డ సెక్షన్ ఆఫీ సర్లు అయిన రోహిత్ కుమార్, సౌరబ్ రానా, దీప క్ కుమార్ ఆధ్వర్యం లో స్ట్రాంగ్ రూములను తెరిచి బ్యాలెట్ బాక్సుల ను కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది తరలించారు. పట్టభద్రుల సహాయ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్, ఉపాధ్యాయుల సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ ఎన్. రాజ శేఖర్ పర్యవేక్షణ చేస్తున్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 40 టేబుల్స్, ఉపాధ్యా యుల ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *