ఋగ్వేద పండితులకు, అర్చకులకు జిల్లా కలెక్టర్ చే సత్కారం
ఋగ్వేద పండితులకు, అర్చకులకు జిల్లా కలెక్టర్ చే సత్కారం
శ్రీ శోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ ను వేద పండితులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందుఆశీర్వవచనం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అర్చకులైన ఐ.ఎస్.శ్రీనివాస్ గురుకుల్, అర్చక శ్రీ సుందర వినాయక స్వామి దేవస్థానం, చిత్తూరు, శ్రీ బి.వేణుగోపాల్ అర్చకులు, శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చిత్తూరు, పండితులుపాణ్యo శ్రీనివాస శర్మ మొగిలి వారికి ఒక్కొక్కరికి రూ. 10,116/- మరియు కండువా, పంచలు, పండ్లు, పూలహారములతో సత్కరించడం జరిగింది. ఈకార్యక్రమములో జిల్లాదేవాదాయ శాఖ అధికారి జె. ఏకాంబరం, అర్చక సంఘంప్రతినిధులు పాల్గొన్నారు.