23, మార్చి 2023, గురువారం

యువతకు ఆదర్శవంతనీయుడు భగత్ సింగ్

 యువతకు ఆదర్శవంతనీయుడు భగత్ సింగ్        

వర్థంతి వేడుకలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు    

  

      బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువకిశోరం భగత్ సింగ్ 92 వ వర్ధంతి గురువారం చిత్తూరు సిపిఎం కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం లో కీలక పాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యుడు భగత్ సింగ్ అని కొనియాడారు.

    దేశంలో మతోన్మాద ప్రమాదాన్ని, సామ్రాజ్యవాద ప్రమాదాన్ని అధ్యయనం చేసి పోరాటం చేసిన యోధుడు. అతిపిన్న వయసులోనే దేశం కోసం నవ్వుతూ ఉరికంబా నెక్కిన గొప్ప నాయకుడు అన్నారు. చనిపోయే ముందు ఒక భగత్ సింగ్ చనిపోతే లక్షలాదిమంది భగత్ సింగ్లు పుడతారని ఆంగ్లేయులను హెచ్చరించారు. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్ ను అరెస్టు చేసి జైల్లో ఉంచితే తండ్రి నువ్వు ఒప్పుకుంటే విడుదల చేస్తానని చెప్పగా ఈ దేశం కోసం గర్వంగా చనిపోతానని వారికి లొంగిపోవాల్సిన అవసరం లేదని తండ్రికి లేఖ రాసిన గొప్ప నాయకుడు అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు ఆశయాలను నేడు దేశంలోని ప్రతి యువత అలవర్చుకొని దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నేడు దేశంలో ఉన్న మతోన్మాద శక్తులు మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ విద్యార్థులను యువతను తప్పుదారి పట్టిస్తున్నారని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినపుడే నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్, చైతన్య, ప్రసాద్,ప్రకాష్, బాలు,లోకనాదం తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *