పాడి రైతులను ఆదుకోండి.! TDP వినతి
పాడి రైతులను ఆదుకోండి.!
తెలుగుదేశం పార్టీ నాయకుల వినతి
వేసవి తాపం రోజురోజుకి తీవ్రమవుతుండటంతో పాడి పరిశ్రమను ఆదుకోవాలని, అదేవిధంగా చనిపోయిన పశువులకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ కలిసి వినతి పత్రం అందచేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా వాణిజ్యా విభాగం ఉపాధ్యక్షులు సునీల్ చౌదరి, చిత్తూరు తెలుగుదేశం పార్టీ రూరల్ ప్రెసిడెంట్ శశికర్ బాబు, సోషల్ మీడియా తెలుగు యువత సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ శరవన్ కుమార్, పూతలపట్టి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సునందిని, క్షీరసాగరం, అనే పథకాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. పాడి రైతులకి కేవలం ఒక రూపాయికి ఎండిగడ్డి, పచ్చి గడ్డి ఇవ్వడంతో పాటు ఉచితంగా దానా కూడా సరఫరా చేసి వేసవి తాపం నుండి పాడి రైతుల ఆదుకుందని అన్నారు. ప్రస్తుతం పాడి రైతులకి పసుపు దాన, పచ్చి గడ్డి ,ఎండు గడ్డి అందుబాటులో లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ.. పశువులని కబేలాలకు తరలిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అనేక కారణాల చేత చనిపోయేటువంటి పశువులకి గతంలో భీమా సౌకర్యం కల్పించారని, ప్రస్తుతం ఒక రూపాయి కూడా బీమా అందని పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఒక ట్రాక్టర్ ఎండు గడ్డి 15000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి ఉందని అన్నారు. వేసవిలో పసుపు శిబిరాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్లు, ఏహెచ్ఎల్, గోపాలమిత్రులు గ్రామాల్లో పర్యటించి పశువులకు సేవలు అందించాలని కోరారు.