13, మార్చి 2023, సోమవారం

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ డా. అరుణ

 పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ డా. అరుణ 


      తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను నగర కమిషనర్ డా. జె అరుణ సోమవారం ఉదయం పరిశీలించారు. పీసీఆర్ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల, బీఎస్ కణ్ణన్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను చేపట్టారు. 

      ఈ పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సామియాన, బారికేడ్ల ఏర్పాటును పరిశీలించారు. మెడికల్ డెస్క్ ను,  హెల్ప్ డెస్క్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. స్ట్రాంగ్ రూమ్,  రిసెప్షన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *