15, మార్చి 2023, బుధవారం

ఘర్షణలో పగిలిన హాస్టల్ విద్యార్ధి తల

ఘర్షణలో పగిలిన హాస్టల్ విద్యార్ధి తల

   

      చంద్రగిరి బాయ్స్ కళాశాల బీసీ హాస్టల్ లో బుధవారం జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో సీనియర్ విద్యార్థి రాఘవేంద్ర తలను పగలగొట్టారు. బయట వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని  సీనియర్ విద్యార్థులు చెపుతున్నారు. తమపై హాకీ స్టిక్స్ ఇనుపరాడులతో దాడి చేశారని తెలిపారు.

      ఈ గొడవను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న వంట మాస్టర్ సెల్ తీసుకుని వీడియోలు డిలీట్ చేశారు. ఇంత జరుగుతున్నా అందుబాటులో  హాస్టల్ వార్డెన్ లేరు. నేటి నుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన వలన విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. రేపటి నుండి ఎగ్జామ్స్ కి బయట సెంటర్ కి వెళ్ళటప్పుడు ఏమన్నా జరగచ్చని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *