చీకటి G.O 1 ని రద్దు చేయాలి: CPI
చీకటి G.O 1 ని రద్దు చేయాలి
అరెస్టులు, నోటీసులతో ఉద్యమాన్ని ఆపలేరు
సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు
భారత కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్ నాగరాజు మాట్లాడుతూవై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, రోడ్ షోలు ,సభలు , సమావేశాలు జరుపుకూడదని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ధర్నాలు నిరసనలు సమావేశాలు నిర్వహించకూడదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవో 1 ని విడుదల చేయడం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర ప్రజలకు తెలియకూడదని కుట్ర పన్ని ప్రతిపక్షాల గొంతులు నొక్కడానికి జీవో 01 ని తీసుకురావడం దుర్మార్గమన్నారు అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగే జీవో నెంబర్ ఒకటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు పిలుపు ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాలు 20న విజయవాడకు తరలి వెళ్ళనున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పోలీసులను ఉపయోగించి విజయవాడకు రాకుండా పోలీసుల ద్వారా కార్యకర్తలను అడ్డుకున్న, పోలీసులు ద్వారా నోటీసులు ఇచ్చిన పోరాటాలు ,ఉద్యమాలు ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం దురుద్దేశం తో విడుదల చేసిన జీవో 01 వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేయవలసి వస్తుందని హెచ్చరించారు సమావేశంలో పార్టీ నాయకులు మణి జయలక్ష్మి జమీలాబి విజయ గౌరీ బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.