10, మార్చి 2023, శుక్రవారం

శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సిద్ధం కండి: JC

 శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సిద్ధం కండి  

 జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్


       ఈ నెల 16 న శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ను పగడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కోరారు. శుక్రవారం ఆర్ వి ఎస్ కాలేజీ ఆడిటోరియంలో   ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజక వర్గశాసనమండలి ఎన్నికలు ఈ నెల 13 న జరగనున్నాయి. అనంతరం  కౌంటింగ్ ఈనెల 16న  ఆర్ వి ఎస్ కాలేజ్ లో  జరగనుంది.  ఇందులో  భాగంగా కౌంటింగ్ పర్సనల్స్ కు రెండో సారి శిక్షణా తరగతులను తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల వారీగా నిర్వహించగా ఏఆర్ఓ,   డిఆర్ఓ ఎన్. రాజశేఖర్ పర్యవేక్షణలో రిటైర్డ్ ఎ జె సి, మాస్టర్ ట్రైనర్ వి.ఆర్. చంద్రమౌళి కౌంటింగ్ నిర్వహణ,  సందేహాలను నివృత్తి చేశారు.

      ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రకా శం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపా ధ్యాయుల నియోజ క వర్గశాసనమండలి  ఎన్నికలకు సంబంధించి నెల 16 న ఆర్ వి ఎస్  లా కాలేజీలో ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్, ఆర్ వి ఎస్ ఇంజ నీరింగ్ కళాశాలలో పట్టభద్రుల నియో జకవర్గ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిం చడం జరుగుతుందని తెలిపారు.. ఈ కౌంటింగ్ నిర్వహణకు విధులు కేటా యించిన కౌంటింగ్ పర్సనల్స్ నిష్పక్ష పాతంగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు.  భారత ఎన్నికల సంఘం  ఎన్నికల నియమావళి పై రూపొందించిన మాన్యువల్ పై పూర్తి అవగాహనను ఏర్పరచుకొని పగడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ జరపాలన్నారు. ఏ ఆర్ ఓ, డిఆర్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ శాసలిమండలి ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియ  సమర్థ వంతంగా చేయాలని, అప్రమత్తంగా వ్యవ హరించాలని సూచించారు. 

               

  రిటైర్డ్  ఏ జే సీ, మాస్టర్ ట్రైనర్ వి ఆర్ చంద్ర మౌళి మాట్లాడుతూ శాసనమండలి ఓట్ల లెక్కింపుప్రక్రియకు సంబంధించి  పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ కౌంటింగ్ కు కేటాయించిన కౌంటింగ్ పర్సనల్స్ కౌంటింగ్ మాన్యువల్ లోని ప్రతి అంశం పై అవగాహన అవసరమని తెలుపుతూ సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణ తరగతుల అనంతరం ప్రాక్టికల్ గా డమ్మీ కౌంటింగ్ ప్రక్రియను కౌంటింగ్ పర్సనల్స్ చే చేయించి  వారి సందేహాలను నివృత్తి చేశారు.

       ఈ శిక్షణ తరగతుల లో తిరుపతి, అన్న మయ్య డి ఆర్ ఓ లు  శ్రీనివాసరావ్, సత్యనారాయణ, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు మదనపల్లె, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు ఆర్డీఓలు రేణుకా,సుజన, శివయ్య, మురళి, చంద్ర ముని రాణార్, రామారావు, కిరణ్ కుమార్, కౌంటింగ్ పర్సనల్స్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *