మైనార్టీ కార్పోరేషన్ ని పునర్నిర్మిస్తాం: నారా లోకేష్
మైనార్టీ కార్పోరేషన్ ని పునర్నిర్మిస్తాం
ముస్లిం మైనారిటీ సదస్సులో నారా లోకేష్
అన్నమయ్య జిల్లా తంబలపల్లి ముస్లిం మైనారిటీల కార్పోరేషన్ నిర్వీర్యం చేసి మైనార్టీలకు ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నారా లోకేష్ మండిపడ్డారు. కులాల, మతాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆఖరికి ముస్లిం మైనార్టీల మధ్య దుల్హన్ పధకం చిచ్చుపెట్టిందన్నారు. రంజాన్ తోఫా లేకుండా ఇవ్వకుండా చేసి మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి అనగాతొక్కారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ మైనార్టీలకు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని నారా లోకేష్ గుర్తు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు దుల్హన్ పధకం కింద 45 వేల జంటలకు సహాయం అందించి రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారని అన్నారు. టీడీపీ హయాంలో పెట్టిన సంక్షేమాలు రద్దుచేసి, నాలుగేళ్ళ కాలంలో మైనార్టీలకు చేసిందేమీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీల కార్పోరేషన్ ను పునర్నిర్మిస్తామని, మైనార్టీలఅభివృద్ధికి అన్ని విధాలా అండగా తెలుగుదేశం ఉంటుందని నారా లోకేష్ అన్నారు.