లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో పదవ తరగతి చదవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అత్యంత ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. కాణిపాకం సమీపంలోని సిద్దంపల్లె లో వెలసిన శ్రీ విఘ్నేశ్వర మహా పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఈ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ సెక్రెటరీ వీరరాఘవులు నాయుడు, విశిష్ట అతిథులుగా లిటిల్ ఏంజిల్స్ హై స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాధ రెడ్డి, ఆడిటర్ రాజశేఖర్ హాజరయ్యారు.
లిటిల్ రోజ్ కరస్పాండెంట్ డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ssc లో వచ్చే మార్కుల ప్రాతిపదికగా ఉంటుందని.మీ ఆశయం నెరవేరదానికి ఈ ఒక్క నెల ఇష్టపడి చదవమని సలహా ఇచ్చారు. సంకల్పం గట్టిగా ఉంటే ఆశయం సిద్ధిస్తుందని చెప్పారు. వీర రాఘవులు నాయుడు మాట్లాడుతూ ధ్యానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా ఉపయోగించు కావాలన్నారు. లిటిల్ రోజ్ పాటశాలలో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం తరగతులు నిర్వహించడం వలన వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్నారు. విశిష్ట అతిిదివిశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ ssc ఎగ్జామ్స్ లో తీసుకోవలసిన జాగ్రత్తలను, మెళకువలను కొత్తగా పరిచయం చేసిన మార్పులను కూలంకుషంగా వివరించారు. మరో విశిష్ట అతిధి రాజశేఖర్, పాటశాల యంగ్ డైరెక్టర్ డాక్టర్ లోహిత్ కుమార్ మాట్లాడుతూ భయం లేకుండా హ్యాపీగా ఎగ్జాం హల్ కు వెళ్లాలని ఆఖరి సమయంలో ఎక్కువగా చదవకండి అని టెన్షన్ కు దూరంగా ఉండాలన్నారు. పాజిటివ్ గా ఆలిలోచించాలన్నరు. అతిదులందరు విద్యార్థినీ విద్యార్థులను ఆశీర్వదించారు.
వినాయకునికి అభిషేకం సరస్వతి పూజ అనంతరం వీడ్కోలు సమావేశంలో అతిదులందరిని దుస్సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాటశాల డైరెక్టర్స్ రాధిక గోపాల కృష్ణ , పవిత్ర లోహిత్, అకడమిక్ ఇంఛార్జి దుర్గాశ్రీ అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.