20, మార్చి 2023, సోమవారం

VOAలకు HR పాలసీ అమలు చేయాలి: CITU డిమాండ్

 VOAలకు HR పాలసీ అమలు చేయాలి

ధర్నాలో CITU డిమాండ్                   

                      


          వివోఏల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వివోఎల ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి వివోఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీను రాజశేఖర్, నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వివోఏల పై రాజకీయ వేదిక పాల్పడడం దుర్మార్గమన్నారు. 

        వీరికి  హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని, 64 సర్కులర్ రద్దు చేయాలని, మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, జెండర్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అనేక సార్లు పోరాటం చేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోసారి పోరాటం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ నిర్వహించి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 27 వేల మంది వారిని ఉపాధి దెబ్బతీసే పద్ధతులు ప్రభుత్వం వివరించడం దుర్మార్గమన్నారు. కోటి మంది మహిళలకు సేవలు అందిస్తున్న వివో లపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హామీలు ఇచ్చిన వివోఏల సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో వివోఏల సంఘం జిల్లా కోశాధికారి వసంత జిల్లా నాయకులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *