9, మార్చి 2023, గురువారం

పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో MLC ఎన్నికలు: SP వై.రిశాంత్ రెడ్డి

 

పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో MLC ఎన్నికలు 
 

జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 13వ తేదీన జరగబోయే MLC ఎలక్షన్స్ నేపధ్యంలో ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి జిల్లా లోని అధికారులతో చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా ఎస్పీ అధికారులకు తగు సూచనలు చేస్తూ ఎలక్షన్లకు పటిష్ట బందోబుస్తును ఏర్పాటు చేయాలన్నారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను చాల పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలున్నాయి ఇందులో 16 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు.  ఆ పోలింగ్ కేంద్రాలలో పోలీసు బలగాలతో పాటు అదనపు బలగాలను కూడా నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 

      పోలింగ్ తేదీ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు జరిగితే ప్రిసైడింగ్ అధికారికి తెలియపరిచి సమస్యలను పరిష్కరించాలన్నారు. రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి చట్ట ప్రకారం బైండ్ ఓవర్ చేసుకోవాలని,  పోలింగ్ కేంద్రాలకు బ్యాలట్ బాక్సులను 12వ తేదిన పటిష్టమైన బందోబుస్తు నడుమ పంపుతామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ..  ప్రతి మండల పరిధికి ఒక మొబైల్ పార్టీ ని నియమిస్తూ దానికి ఒక ఎస్.ఐ. స్థాయి అధికారి ఇంచార్జ్ గా ఉంటారన్నారు. . ఎలక్షన్ నియమావళి ప్రాకారం పోలింగ్ కేంద్రాలకు 100mts వరకు ప్రజలు ఎవరు ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.  అధికారులు వారి సిబ్బందికి ఎలక్షన్ కి ముందు తగు సూచనలు చేసి ఒక చిన్న పాటి ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఏ రాజకీయ పార్టీ వారు కూడా ఓటర్లను తమ సొంత వాహనములో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని రాకూడదనీ, ఇలాంటివి జరిగితే తీసుకోని వచ్చిన వాహనాన్ని సీజ్ చేసి వాహన దారుడి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. 

     ఓటింగ్ స్లిప్స్ లాంటివి పోలింగ్ కేంద్రాల వద్ద పంచకూడదన్నారు.  ఎలక్షన్ నేపధ్యం లో అక్రమ మద్యం రవాణ చేసే అవకాశాలు ఉన్నందున చెక్ పోస్ట్లను పెంచి వాహన తనికీలు మరింత కఠినతరం చేయాలని తెలిపారు. పోలింగ్ ముందు రోజు ఎవరైనా డబ్బులు పంచితె అట్టివారిపై కేసులను నమోదు చేయాలన్నారు.  పోలీస్ సిబ్బంది ఎలక్షన్ అనంతరం బ్యాలట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ చేరే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారు. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ ఆఫీసర్ మినహా ఎవరు పోలింగ్ బూత్ లోనికి ప్రవేశించకూడదు. పోస్టల్ బ్యాలట్ లకు దరఖాస్తు చేసుకున్న వారికి దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై అధికారులు సూచనలు ఇవ్వాలని తెలిపారు.  పోలింగ్ నిర్వహించే అధికారులతో సహా ఎవరు పోలింగ్ కేంద్రాలలోనికి ఇంకు లేదా నీరు లాంటి ద్రవ పదార్ధాలను మరియు మొబైల్స్ లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి తీసుకొని వెళ్ళకూడదని చెప్పారు.  

     ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్  జి.నాగేశ్వర రావు, ఎస్.బి. డి.ఎస్పీ శ్రీనివాస రెడ్డి, జిల్లాలోని డి.ఎస్పీ లు, సి.ఐ. లు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *