కౌంటింగు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి
చిత్తూరు SVCET కాలేజీ లోని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగు ప్రక్రియ, బందోబస్తు చర్యలను రెండవ రోజు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి పరిశీలించి, సమీక్షించారు. కౌంటింగు ప్రక్రియ ముగిసేంత వరకు సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏజెంట్లను చెక్ చేసి కౌంటింగ్ కేంద్రాల్లోకి పంపారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, తదితర చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ తో పాటు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి.జగదీష్, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వర రావు, చిత్తూరు SDPO కె.శ్రీనివాస మూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.