20, మార్చి 2023, సోమవారం

VRO చేతిని కొరికిన లేడీ కానిస్టేబుల్

VRO చేతిని కొరికిన  లేడీ కానిస్టేబుల్ 


        రైల్వే స్టేషన్ వద్ద విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ వి ఆర్ ఓ బాహాబాహీకి దిగి పరస్పరం ఘర్షణ పడ్డ సంఘటన గుడివాడలో జరిగింది. ఈ గొడవలో వీఆర్వో చేతిని లేడీ కానిస్టేబుల్ కొరకగా ఆగ్రహం చెందిన వీఆర్వో కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు. చలో అసెంబ్లీకి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్త రైలు ఎక్కేందుకు వీఆర్వో అయిన తన భర్తతో కలిసి స్టేషన్ కు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ రమాదేవి అంగన్వాడి కార్యకర్తను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. తన భార్యను అడ్డుకుంటావా అంటూ వీఆర్వో అనిల్ లేడీ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు. బైక్ పై తిరిగి వెళ్ళిపోతుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో గొడవ పెద్దదయింది. వీఆర్వో బైకును అడ్డుకునే క్రమంలో అతని చేతిని కానిస్టేబుల్ కొరకగా, ఆగ్రహం చెందిన వీఆర్వో కానిస్టేబుల్ రమాదేవి చెంపపై కొట్టాడు. ప్రతిగా ఉండే రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరిగిన ఈ వివాదం చూసిన ప్రయాణికులు నిర్కాంత పోయారు. ఈ వివాదం గుడివాడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరడంతో రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *