రూ. 25 లక్షల విలువ చేసే నకిలీ కోకిల బీడీలు సీజ్..
రూ. 25 లక్షల విలువ చేసే నకిలీ కోకిల బీడీలు సీజ్..
ఢిల్లీ నుంచి వచ్చిన కోకిల కంపెనీ ఇంటెలెక్యూవల్ లాయర్లు
పోలీసుల అదుపులో నిందితుడు హరి కిరణ్
మదనపల్లిలో కోగిల కంపెనీ బీడీలకు బదులు నకిలీ కోకిల బీడీలను విక్రయిస్తున్న నిందితుడు హరి కిరణ్ రాయల్ ను ఢిల్లీ నుంచి వచ్చిన కోగిల బీడీ కంపెనీ ఇంటిలెక్సువల్ లాయర్లు పట్టుకున్నారు. స్థానిక శ్రీరామ గోపాల్ నాయుడు వీధిలో కాపురం ఉంటున్న హరి కిరణ్ రాయల్ ఇంట్లో సుమారు 25 లక్షలకు పైగా విలువ చేసే బీడీలను సీజ్ చేసి నిందితున్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు..
ఇందుకు సంబంధించి టూ టౌన్ ఎస్ఐ చంద్రమోహన్ కథనం మేరకు వివరాలు.. హరి కిరణ్, మదనపల్లి పట్టణంలో గత కొన్నేళ్లుగా నిషేధిత హన్స్ పాన్ పరాగ్ గుట్కా కైని జర్దాలను విక్రయించేవాడు. క్రమంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడి అరెస్టయి. తీరు మారకపోగా, చైనా సిగరెట్లు, కోకిల బీడీలు, హంస పాన్ పరాకు గుట్కాలను విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కోగిల కంపెనీ బీడీల యాజమాన్యానికి మదనపల్లి కేంద్రంగా హరి కిరణ్ రాయల్ కోకిల పేరుతో నకిలీ బీడీలను వికరిస్తున్నాడని సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ నుంచి కోగిల కంపెనీ ఇంటలెక్చువల్ లాయర్లు మనిష్ దువ్వె, రాజన్ కుమార్ దువేది, కూనల్ ఠాకూర్ లు మదనపల్లి కి చేరుకున్నారు. గోపాలనాయుడు వీధిలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కోకిల నకిలీ బీడీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బీడీలను పట్టణ ప్రజలకు హోల్సేల్ ధరలకు విక్రయిస్తున్న నిందితుడు హరికిరణ్ రాయల్ ను అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పట్టుబడిన బీడీలు నిందితున్ని పోలీసులకు అప్పగించారన్నారు. పట్టుబడిన బీడీల విలువ సుమారు రూ. 25 లక్షలకు పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితున్ని ఉంచుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు అనంతరం నిందితునికి కిలి కోకిల బీడీలను సరఫరా చేస్తే ముఠాను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.