MLC ఎన్నికలకు సర్వం సిద్దం : జిల్లా కలెక్టర్ హరినారాయణన్
MLC ఎన్నికలకు సర్వం సిద్దం
13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.
16 న ఆర్ వి ఎస్ లా కాలేజిలో ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు,
ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కాలేజిలో పట్టభ ద్రుల ఓట్ల లెక్కింపు .
రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్
ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్దం చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో 13న జరుగు ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, డిఆర్ఓ యన్. రాజశేఖర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పట్టభద్రుల, ఉపాద్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను మంచి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు అవగాహన నిమిత్తంకు బోర్డ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 12న చిత్తూరు, పలమనేరు, కుప్పం,నగరి ఆర్డీ ఒల పరిధిలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పనిసరిగా ఏ దైన గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాలని, (ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు,పాస్ పోర్టు, పట్టాదార్ పాస్ పుస్తకం, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆ శాఖకు సంబంధించిన ఐడి కార్డును) ఏదైన ఒక్కటి గుర్తింపు కార్డు తో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈనెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, 16 న ఆర్ వి ఎస్ లా కాలేజి నందు ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు, ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కాలేజి నందు పట్టభ ద్రుల ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోనికి మీడియాకు అనుమతి లేదని, పోలింగ్ కేంద్రం బయట విజవల్స్ తీసుకోవాలని తెలిపారు.