25, మార్చి 2023, శనివారం

7 మంది అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు: రూ. 2 కోట్ల స్వాదీనం

 కరడుగట్టిన 7 మంది అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు 

 1.6 కిలోల గోల్డ్, 6.5 కిలోల వెండి, 3 కార్లు మరియు 6 ద్విచక్రవాహనాలు స్వాదీనం.

            కరడుగట్టిన 7 మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను వి.కోట పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు 2 కోట్ల రూపాయల విలువ గల 1.6 కిలోల గోల్డ్, 6.5 కిలోల వెండి, 3 కార్లు, 6 ద్విచక్రవాహనాలు స్వాదీనం చేసుకున్నారు. డబ్బును సులభమైన మార్గంలో సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలు చేశారు. దొంగలించిన సొమ్ముతో సుమారు 60 లక్షల విలువైన భూమి కొనుగోలు చేశారు. 

        జిల్లాలోని ఎస్.ఆర్.పురం, పలమనేరు,  వి.కోటలో జరిగిన దొంగతనాలను  ఛేదించు క్రమంలో వి.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్  జె.ప్రసాద్ బాబు  వి.కోట లోని జవునుపల్లి బస్ స్టాప్ వద్ద వాహన తనికీ సమయంలో పోలీసులను చూసి రెండు ద్విచక్ర  వాహనాలలో పారిపోతున్న వ్యక్తులు తిరుపతి, సుధాకర్, అరవింద్, కలై సెల్వలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.  వారిని అదుపులోకి తీసుకోని విచారించగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలుకొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించి నగలు, డబ్బులు, కార్లు మరియు ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్న కేసులో వీరు ప్రధాన నిందితులని గుర్తించారు. 2022వ సం. డిసెంబర్ నెలలో ఎస్.ఆర్.పురం లోని మామిడి తోపులో జరిగిన హౌస్ బ్రేకింగ్ మరియు 2023వ సం. ఫిబ్రవరి లో వి.కోటలో జరిగిన మరో హౌస్ బ్రేకింగ్ మరియు జిల్లా అంతటా నమోదైన హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసింది వీరి ముఠా అని తెలిసింది.  తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో కూడా దొంగతనాలు చేసినట్టు అంగీకరించారు. దీని పై పలమనేర్ డి.ఎస్పీ  వి.కోట సి.ఐ., సిబ్బంది, గంగవరం ఎస్.ఐ.  పి.సుధాకర్ రెడ్డి, సిబ్బంది, బంగారుపాళ్యం ఎస్.ఐ.  పి.మల్లికార్జున రెడ్డి, సిబ్బంది, గుడుపల్లి ఎస్.ఐ.  బి.రామాంజనేయులు, సిబ్బంది, మరియు సబ్-డివిజనల్ క్రైమ్ ఐ.డి. పార్టీ ఏ.ఎస్.ఐ.  దేవరజులు రెడ్డి, సిబ్బంది తో 4 టీమ్ లను ఏర్పాటు చేశారు.  తమిళనాడు లోని తిరుపత్తుర్, చెన్నై, సేలం మరియు ఆంధ్ర రాష్ట్రంలోని పుత్తూరు,  తిరుపతి, కర్ణాటక లోని పలు ప్రాంతాలకు వెళ్లి దొంగలించబడిన సొమ్మును రికవరీ చేశారు. ఇతర ముద్దాయిలైన చిన్నస్వామిని కుప్పంలో, శివను పలమనేర్ లో,  చందును తిరుపతిలో అదుపులోకి తీసుకొని దొంగతనం చేసిన  1.6 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, 3 కార్లు,4 ద్విచక్రవాహనాలను రికవరీ చేసారు. క్రిష్ణగిరి జిల్లాలో కొనుగోలు చేసిన భూమి, రికవరీ చేశారు. వాటి అంతటి విలువ సుమారు 2కోట్ల రూపాయలు. 

        ఈ ముఠా నాయకుడు ఎం.తిరుపతి దొంగలించిన బంగారాన్ని తన భార్య అయిన తమిళ్ సెల్వి వద్ద ఉంచి అవసరాల నిమిత్తం బంగారాన్ని మనప్పురం, ముత్త్హూట్ ఫైనాన్సు, అట్టికా గోల్డ్ కంపెనీ లో కుదువ పెట్టి లేదా ఇతరులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఇతను తన బావమరిది అయిన సుధాకర్ తో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడేవాడు. వీరిరువురు పలు మార్లు జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్ళిన సమయంలో చిన్న స్వామి, కలై సెల్వన్, అరవింద్, శివ, చంద్ర ప్రకాష్ లతో పరిచయాలు చేసుకొని జైలు నుండి బయటకు వచ్చిన తరువాత అందరు కలిసి రాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్ళను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడేవారు. దొంగతనం చేసిన బంగారాన్ని అమ్మి అందరు సమానంగా పంచుకునేవారు. ఈ ముద్దాయిలపై పలు రాష్ట్రాలలో చాల కేసులు ఉన్నాయని వీరిలో ఒకరి పై 6 మర్డర్ కేసులు కూడా ఉందని తెలిపారు.

దొంగతనం వివరాలు 

2021వ సం. జూలై నెలలో తమిళనాడు లోని ఇ-రోడ్ లోని ఓ ఇంటి తాలం పగలకొట్టి వజ్రాల గాజులు, కమ్మలు, బంగారు ఆభరణాలు దొంగలించి వాటిని అమ్ముకొని వచ్చిన సొమ్ముతో సుమారు 60 లక్షల రూపాయలతో ప్రధాన నిందితుడైన ఎం.తిరుపతి క్రిష్ణగిరి జిల్లాలో భూమిని కొనుగోలు చేసాడు.

2021వ సం. సెప్టెంబర్ లో కర్నాటక లోని సిద్దాపూర ప్రాంతంలో Toyota Etios కారును చోరీ చేసారు.

డిసెంబర్ 2022వ సం. లో ఎస్.ఆర్.పురం లోని ఓ మామిడి తోపులోని ఇంటిలోని సుమారు 30 లక్షలు విలువ గల బంగారు, వెండి వస్తువులు మరియు నగదును చోరీ చేసారు.

సెప్టెంబర్ 2022వ సం. లో చంద్రగిరిలో Swift కార్ ను దొంగలించారు.

2022వ సం. లో డిసెంబర్ లో కాట్పాడి లో ఓ ఇంటి ముందు ఉన్న Volkswagen కార్ ను దొంగలించారు.

2022వ సం. లో తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలలోని పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడ్డారు.

2023వ సం. ఫిబ్రవరి నెలలో సేలం పరిసర ప్రాంతంలో ఓ ఇంటిలో చోరి చేసి Honda BR-V కారును దొంగలించారు.

2023వ సం. ఫిబ్రవరి 10వ తేదీన వి.కోట లోని ఓ ఇంటిలో సుమారు 10 లక్షల విలువైన బంగారు మరియు వెండి వస్తువుల చోరి.

2023వ సం., ఫిబ్రవరి నెలలో హోస్కోట పట్టణం లో హోండా Access Scooty, మార్చ్ 18 వ తేదిన వి. కోటలో Hero Splender + మోటార్ సైకిల్ దొంగతనం.

2022వ సం.లో తిరుపతి లోని ఎం.ఆర్.పల్లి లో రెండు ఇళ్ళలో చోరి.

తిరుపతి మరియు పుత్తూరు లో సుమారు 2 సం.నుండి నివాసం ఏర్పరుచుకొని, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడు మరియు కర్ణాటక లో భారీగా దొంగతనాలు.

  నిందితుల వివరములు 

1) ఎం.తిరుపతి @ సంతోష్, వయస్సు 35 సం., s/o మురుగేషన్, మైలడం పారై(గ్రా), క్రిష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఇతను ముఠా నాయకుడు.  వృత్తి కూలి. ఇతను ఆంధ్ర, తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలలో మొత్తం సుమారు 50 కేసులలో ప్రధాన నిందుతుడి గా వున్నాడు.

2) ఎన్.సుధాకర్ @ సుధా, వయస్సు 33 సం., s/o నటరాజ్, సహదేవన్ కోటై (గ్రా), తిరుపత్తుర్ జిల్లా, తమిళనాడు. ఇతను ఏ 1 అయిన తిరుపతి కి బావమరది. ఇతని వృత్తి కూలి. ఇతను ఆంధ్ర, తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలలో మొత్తం 33 కేసులలో ప్రధాన నిందుతుడి గా వున్నాడు.

3) కె.చిన్న స్వామి, వయస్సు 57 సం., s/o లేట్ కుప్పుస్వామి, నిమ్మ కారుపల్లి (గ్రా), కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. ఇతని వృత్తి కూలి. ఇతను ఆంధ్ర, తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలలో మొత్తం 20 కేసులలో నిందితుడు.

4) ఎస్.అరవింద్, వయస్సు 24 సం., s/o శేఖర్, కోటై (గ్రా), తిరుపత్తూర్ జిల్లా, తమిళనాడు. ఇతని వృత్తి డ్రైవర్. ఇతనిపై తమిళనాడు లో 10 కేసు ఉంది. 

5) ఎం.శివ, వయస్సు 45 సం., s/o నరసింహులు, గంటావూరు (గ్రా), పలమనేర్, చిత్తూరు జిల్లా. ఇతని వృత్తి లారీ డ్రైవర్. ఇతను ఆంధ్ర మరియు తమిళనాడు రాష్ట్రం లో 5 మర్డర్ కేసులలో మరియు 10 దొంగతనాల కేసులో నిందుతుడిగా వున్నాడు.

6) ఎస్.చంద్ర ప్రకాష్, @చంద్రు, వయస్సు 23 సం., s/o శంకర్, నాటం కోటై (గ్రా), క్రిష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఇతని వృత్తి కూలి. ఇతను ఆంధ్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రం లో మొత్తం 20 కేసులలో నిందితుడు.      

7) ఎస్.కలై సెల్వన్, వయస్సు 37 సం., s/o లేట్ సుబ్రహ్మణ్యం, తిరువన్నామలై జిల్లా, తమిళనాడు. ఇతని వృత్తి అంబులన్స్ డ్రైవర్. ఇతనిపై తమిళనాడు లో 2 కేసులు ఉన్నాయి. 

చిత్తూరు జిల్లా ఎస్పీ గారు పై కేసులను చాకచక్యంగా చేధించిన వి.కోట పోలీసులు,  పలమనేరు సబ్-డివిజనల్ అధికారులను,  సిబ్బందిని ప్రత్యేకంగా అభినంధించి రివార్డులు ఇచ్చారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *