9, మార్చి 2023, గురువారం

తిరుపతిలో మోసగాడు మీర్ అరెస్ట్


తిరుపతిలో   మోసగాడు మీర్ అరెస్ట్

               తిరుపతి విధ్యానగర్ కు చెందిన వై.ప్రణీత్ ఇచ్చిన పిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కొర్లగుంటకు చెందిన సయ్యద్ మీర్ అనే వ్యక్తిని తిరుపతి నందు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సయ్యద్ మీర్ అనే వ్యక్తి తిరుపతి నందు మీర్ టీవి అనే పేరుతో ఎటువంటి రిజిస్త్రేషన్ లేని యూట్యూబ్ చానల్ ను ప్రారంభించాడు.   ఈ యూట్యూబ్ చానల్ ను ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రారంభించాను అని చెప్పుకుంటూ దందాలు మోసాలకు పాల్పడ్డాడు. 

         అందులో ఎం.డి. గా పని చేస్తున్న వై ప్రణీత్ తన ఉద్యోగాన్ని వదిలివేయడంతో తనకు రావల్సిన కాంట్రాక్టు డబ్బులు తిరిగి ఇవ్వవలసిన విషయంలో వాదోప వాదాలు జరిగాయి. ఈ  సమయంలో  మీర్ వ్యక్తి ప్రణీత్ ని కత్తితో పొడిచి హత్యా ప్రయత్నం చెయ్యబోయాడు.   తప్పించుకున్న ప్రణీత్ ను కులం పేరుతో దూషించిన సయ్యద్ మీర్ పై  తిరుచానూరు పోలీసులకు పిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు అరెస్టు చేశారు.  కోర్టులో హాజరు పరచడంతో కోర్టు వారు రిమాండు విధించారు. సయ్యద్ మీర్ ను తిరుపతి సబ్ జైలుకి తరలించడం జరిగింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *