నేడు ఉగాది కవి సమ్మేళనం
నేడు ఉగాది కవి సమ్మేళనం
చిత్తూరు గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురునాథ టాకీస్ వద్దగల రెడ్డి భవన్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు శోభక్రుత్ ఉగాది కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రధానం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి సేవనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురజాడ ఫౌండేషన్ అధ్యక్షులు ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ కవి పసపల హరికృష్ణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, భక్తి ఛానల్ ఫేమ్ డాక్టర్ కే వేణుగోపాల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కే రామలక్ష్మి, ప్రముఖ సామాజికవేత్త అశోకానంద రెడ్డి తదితరులు అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో 100 పెద్ద బాలశిక్ష పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, కవులు భాషావేత్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.