10 KGల గంజాయిని స్వాదీనము
10 KGల గంజాయిని స్వాదీనము
గుడుపల్లి మండలం, కుప్పం-పలమనేరు రోడ్, చప్పిడిగరుగులు క్రాస్ వద్ద శుక్రవారం కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ Md.రియాజ్ అహ్మద్, గుడుపల్లి సబ్-ఇన్స్పెక్టర్ B.రామాంజనేయులు, సిబ్బంది 10 KG ల గంజాయిని స్వాదీనము చేసుకున్నారు.
ఈ సందర్భంగా శాంతిపురం మండలం, కడపల్లి పంచాయితీ, మాదనపల్లి గ్రామస్తుడు మునివెంకటప్ప, వయస్సు 55 సం.లు, తండ్రి పేరు లేట్ మునస్వామి అనునతని అరెస్టు చేసారు. అతని నుండి ప్లాస్టిక్ సాంచిలోని 10 KG ల గంజాయిని స్వాదీనము చేసుకోవడమైనది. సదరు గంజాయి విశాఖపట్నంకు చెందిన వ్యక్తి కుప్పంకు తీసుకొచ్చి, మునివెంకటప్పకు ఇస్తాడు. సదరు గంజాయిని మునివెంకటప్ప చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కుప్పం, బెంగళూరు పరిసర ప్రాంతాలలో అమ్ముతాడని విచారణలో తెలిసింది. దీనిపై గుడుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయి మునివెంకటప్పను రిమాండు నిమిత్తం కుప్పం కోర్టుకు తరలించడ మైనది.