18, మార్చి 2023, శనివారం

వినాయకం స్వామిని దర్శించుకున్న TDP MLC శ్రీకాంత్

 వినాయకం స్వామిని దర్శించుకున్న TDP MLC కంచర్ల శ్రీకాంత్ 


        ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కాణిపాకం వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆలయ, ఏ ఈ ఓ, విద్యాసాగర్ రెడ్డి అందజేశారు. అనంతరం వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్  మీడియాతో  మాట్లాడతూ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టిడిపి పార్టీ కార్యకర్తలతో స్వామి వారిని దర్శించుకున్నాను. తర్వాత తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్వామి వారి దర్శనానికి వచ్చాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మనీ నాయుడు,  మాజీ సర్పంచ్ మధుసూదన్, మాజీ జడ్పిటిసి లతా,  ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గిరిధర్ బాబు, వైయస్ గేట్ హరిబాబు బాబు నాయుడు, ధనంజయ నాయుడు, గాలి దిలీప్ నాయుడు, శరవణ, దయానంద మందిడి,  పూతలపట్టు నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *