ప్రజాస్వమ్యానికి మాయని మచ్చ: TDP
శాసనసభ వ్యవస్థకి, ప్రజాస్వమ్యానికి మాయని మచ్చ: TDP
బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 12 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం శాసనసభ వ్యవస్థకి ప్రజాస్వమ్యానికి మాయని మచ్చ అని TDP నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెంకీటిల సురేంద్ర కుమార్, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ మేయర్ కటారి హేమలత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇది అ ప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను, ఈ ప్రభుత్వ పరిపాలనలోప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వైసీపీ ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలను తప్పుదోవపట్టిస్తూ, ప్రజలను నమ్మించడానికి ఇటు బహిరంగంగా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచి బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి నోరు నొక్కుతున్నారన్నారు. శాసనసభలో చెబుదామంటే స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేసి బయటకు పంపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు భయపడి ఎక్కడ శాసనసభలో ప్రభుత్వ తప్పిదాలను మోసాలను అసత్య ప్రచారాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రసారమాధ్యమాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారని భయపడి శాసనసభ సభా గౌరవాన్ని మంట కలుపుతూ ఏకపక్షంగా టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం శాసనసభ వ్యవస్థకి గొడ్డలి పెట్టు లాంటిది అన్నారు. ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థ పైన గాని న్యాయవ్యవస్థ పైన గాని మీడియా వ్యవస్థ పైన గాని ప్రజాస్వామ్య వ్యవస్థ పైన గాని చిత్తశుద్ధి లేదు. అనడానికి ఇదే నిదర్శనం. ఈ నియంతృత్వ పరిపాలనను అంతమొందించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయి, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.