16, మార్చి 2023, గురువారం

పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించిన చిత్తూరు జిల్లా ఎస్.పి రిశాంత్ రెడ్డి

 పొట్టి శ్రీరాములుకు  నివాళులు అర్పించిన చిత్తూరు జిల్లా ఎస్.పి  రిశాంత్ రెడ్డి


         ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషిచేసిన మహనీయుడుపొట్టి శ్రీరాములు  జయంతి సందర్బంగా చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బముగా ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం సాదించాలని 56 రోజుల నిరాహారదీక్ష చేసి తన తుది శ్వాసను విడిచి  ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహా పురుషుడు పొట్టి శ్రీరాములుఅని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా ఉన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల అనేక సార్లు జైలుశిక్షను కూడా అనుభవించారు. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములును  సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి అని ప్రశంసించారు. మనమందరం  పొట్టి శ్రీరాములును   స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు కృషి చేయాలన్నారు.

      అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి SEB DSEO (డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్) అడిషనల్ ఎస్పీ  శ్రీ లక్ష్మి, RI MTO  మధు, డిపిఓ ఏ.ఓ.  కె.ఎం.వి. మోహన్ రావు, ఏ.ఏ.ఓ.  దస్తగిరి, సిబ్బంది పాల్గొని, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *