ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోల్ కాకుండా ప్రభుత్వం పధక రచన
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోల్ కాకుండా ప్రభుత్వం పధక రచన
ప్రభుత్య, ప్రైవేటు విద్య సంస్తలకు, కార్యాలయాలకు సెలవు రద్దు.
ఉద్యోగ, ఉపాద్యాయులు ఓటింగ్ కు వెళ్ళకుండా వ్యూహం
ఓటింగ్ కు వెళ్దామా, వద్దా అని డైలామాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు
స్పెషల్ లీవ్ వినియోగించుకుని ఓట్లు వేసుకోవచ్చని ఆదేశాలు జారీ
MLC ఎన్నికల వేళ ప్రభుత్యం హై డ్రామాకు తెరతీసింది. పోలింగ్ రోజు సాధారణంగా అన్ని ప్రభుత్య, ప్రైవేటు విద్య సంస్తలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. అలా చేస్తేనే ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద ఉద్యోగ, ఉపాద్యాయులు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. కావున ఉద్యోగ, ఉపాద్యాయులను దూరంగా ఉంచాలనే నిర్యానికి వచ్చినట్లు తెలుస్తుంది. కావున ప్రభుత్య, ప్రైవేటు విద్య సంస్తలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించలేదు. ఏ పాటశాలలో అయితే ఓటింగ్ జరుగుతుందో, ఆ పాటశాలకు మాత్రమే సెలవు ప్రకటించింది. ప్రభుత్య, ప్రైవేటు విద్య సంస్తలకు, కార్యాలయాలకు సెలవు ఇవ్వకుంటే ఓటింగ్ శాతం ఘననియంగా తగ్గుతుంది. అంటే YCP వ్యతిరేక ఓట్లు తగ్గుతాయి. ప్రభుత్వానికి కవాల్చింది కూడా అదే. ఉద్యోగ, ఉపాద్యాయులకు సెలవు ఉంటే, TDP లేక PDF అభ్యర్థులకు ఓట్లు వేసే ప్రమాదం ఉంది. ప్రతి పక్షాల ఓట్లను ఘననియంగా తగ్గించడానికి ప్రభుత్వం పధకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
పోలింగ్ రోజు స్పెషల్ లీవ్ వలన ప్రయోజనం లేదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఇలా చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలకు ఓట్లు వేయలి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలను ఓవైపు నిర్వహించుకుంటూనే, మరో వైపు ఆ రెండు ఓట్లు ఎలా వినియోగించుకోవాలో తెలియక ప్రభుత్వ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో నమోదు అయిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల ఓట్లను ఎలా వినియోగించుకోవాలంటూ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే అనుమానంతోనే పోలింగ్ రోజు సెలవు ప్రకటించలేదంటూ పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోపణలు చేస్తున్నారు. స్పెషల్ లీవ్ పెట్టి ఓట్లు వేసినా, ఆ లీవ్ శాంక్షన్ అవుతుందో లేదో అనే అనుమానం ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ కు గైర్హాజరీపైనే ఆసక్తి మెజారిటీ ఉద్యోగ, ఉపాధ్యాయులు చూపుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చేస్తేనే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.