14, మార్చి 2023, మంగళవారం

చట్ట వ్యతిరేక కార్యకలాపాలమిద దృష్టి పెట్టాలి: అనంతపురం రేంజ్ DIG ఎం. రవి ప్రకాష్

అసాంఘిక శక్తుల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలమిద  దృష్టి పెట్టాలి.  

అనంతపురం రేంజ్ DIG ఎం. రవి ప్రకాష్

         చిత్తూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని మరియు ఏ.ఆర్ పోలీసు విభాగాన్ని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS  ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి IPSతో కలిసి ఈరోజు వార్షిక తనిఖీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం, స్పెషల్ బ్రాంచి, డీసీఆర్బీ, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీం, ఏ.ఆర్, ఎం.టి,  తదితర  విభాగాలకు చెందిన అన్ని రికార్డులను మరియు పనితీరును లోతుగా ఇన్స్పెక్సన్ చేశారు. 

        ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ DIG ఎం. రవి ప్రకాష్ మాట్లాడుతూ..   జిల్లా స్పెషల్ బ్రాంచి పటిష్టమైన సమాచార వ్యవస్థతో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. భూకబ్జాదారులు, అరాచక శక్తుల, కిరాయి హంతకుల ముఠాల కదలికలపై నిఘా వేయాలని, పొలిటికల్ వైరి వర్గాలు, పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ పట్ల దృష్టి సారించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసాంఘిక శక్తుల, చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచార సేకరణపై దృష్టి పెట్టాలి. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ , రిమోట్ విలేజీలను గుర్తించాలి. ఆయా గ్రామాల్లో  గొడవలు జరుగకుండా ఇప్పటి నుండే కృషి చేయాలి. ఎస్సై ల నుండీ డీఎస్పీల వరకు అందరూ అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీఎస్పీలు, సి.ఐ లు వారి పరిధిల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో క్రైం మీటింగ్స్ పెట్టుకుని ఎప్ఫటికప్పుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రొసీడింగ్స్ పంపాలి. CCTNS లో వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. SHRC/NHRC పిటీషన్లపై నిర్లక్ష్యం లేకుండా చట్టపరంగా వ్యవహరించాలి. సైబర్ నేరాల్లో పురోగతి సాధించాలి. ప్రజల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన తేవాలి. మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని మహిళలపై నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీసీఆర్బీలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఫైళ్లను కంప్యూటరైజ్డ్ చేయాలి. ఏదైనా నేరం జరిగిన వెంటనే సాఫ్ట్ కాఫీలను ఆయా పోలీసు అధికారులకు పంపే వీలుంటుందని డి.ఐ.జి. తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *