23, మార్చి 2023, గురువారం

జాతీయ రహదారుల పనులు వేగవంతం: JC



జాతీయ రహదారుల పనులు వేగవంతం 
జిల్లా జాయింట్ కలెక్టర్


     జిల్లా అభివృద్ధికి తోడ్పడే జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఎన్ హెచ్ 71 పీలేరు- కాలూరు రోడ్డు పను లకు సంబంధించి జాయింట్ కలెక్టర్ సంబంధింత అధి కారులతో సమీక్ష నిర్వహించారు.

      ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో రొంపిచర్ల మండలం బొంబాయి గారిపల్లి, బండ కింద పల్లి, పెద్దగొట్టుగల్లు, సదుం మండలం ఊటుపల్లి లలో పెండింగ్ రోడ్డు పను లను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులను పూర్తి చేసేందుకుతహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రతి రోడ్డు పనికి గల కారణాలను క్షుణ్ణం గా సమీక్షించారు.

            ఈ సమావేశంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక,కలెక్టరేట్ జి, ఈ సెక్షన్ ల సూపరిం డెంట్లు వెంకటేశ్వర్లు, మురళి,పులిచెర్ల తహసిల్దారు అమ ర్నాథ్, సంబంధిత అధికారులు పాల్గొ న్నారు..

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *