శాసన మండలిలో BCల వాణిని వినిపిస్తా : పూసల రవి
శాసన మండలిలో BCల వాణిని వినిపిస్తా : పూసల రవి
శాసన మండలిలో BCల వాణిని వినిపించడానికి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా తనను గెలిపించాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసల రవి కోరారు. గురువారం చిత్తూరు Pess Club ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ప్రారంభం నుంచి BCల అభ్యున్నతికి అనేక పోరాటాలు చేశానన్నారు. బీసీల సమస్యలను శాసనమండలంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి బీసీల ప్రతినిధి అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీల తరపున ఎన్నికయ్యే అభ్యర్థులు తమ పార్టీ విధివిధానాలు కనుగుణంగా ప్రవర్తిస్తారన్నారు. ఏ పార్టీకి కూడా బీసీల గోడు పట్టడం లేదన్నారు. బీసీలు తమకు వెన్నెముక అంటూనే వెన్నెముకను విరచడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవులను అగ్రవర్ణాలు అనుభవిస్తూ.. అధికారంలేని పార్టీ పదవులను బీసీలకు పడేస్తున్నారని విమర్సించారు. ఆంధ్రప్రదేశ్ జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాటి గంగాధర్ మాట్లాడుతూ బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పూసల రవికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనేక సంవత్సరాలుగా బీసీల అభ్యున్నతికి చేస్తున్న సేవలను గుర్తు చేశారు. శాసనమండలిలో బీసీ గొంతుకను వినిపించడానికి రవిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జరగనున్న పట్టభద్రుల శాసనసభ నియోజకవర్గం నుండి 13వ నెంబర్ పూసల రవి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపిం చాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.