4, మార్చి 2023, శనివారం

అవగాహన సదస్సు పేరుతో జరిగే ఎన్నికల సమావేశాలను రద్దు చేయాలి. CPM


 అవగాహన సదస్సు పేరుతో జరిగే ఎన్నికల సమావేశాలను రద్దు  చేయాలి. 
 
         

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్.                 

        గంగవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా  5 న ఆదివారం సా౹౹ 04.00 గంటలకు MLC ఎలక్షన్ అవగాహన సదస్సు పేరుతో ఎన్నికల సమావేశాలు జరపడాన్ని వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అడ్డు దారుల్లో అందర్ని బెదిరించారని కి పూనుకుంటున్నదని విమర్శించారు . ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉద్యోగులతో సమావేశాలు ప్రజాప్రతినిధులు పెడతారని ప్రశ్నించారు. పలమనేరు శాసనసభ్యులు Dr. N. వెంకటే గౌడ మరియు MLC అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హాజరవుతున్నారంటే ఇది ప్రలోభాలకు గురి చేయడమే.ఈ సమావేశంలో  టీచర్స్, గ్రాజుయేట్స్,నాయకులు,కార్యకర్తలు, యువకులు, ysrcp కుటుంబ సబ్యులు వచ్చి విజయవంతం చేయాలని పిలుపు లు ఇస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.అవగాహన అధికారులు, ప్రభుత్వం కల్పించాలని, పార్టీ సమావేశాలకి టీచర్లు ను హాజరు కావాలి అని ఒత్తిడి తీసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు.టీచర్లు సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలం అయిన వీరు ఇప్పుడు టీచర్ల అవసరం వచ్చిందా అని ప్రశ్నించారు.వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *