మహిళా చట్టాల పై మహిళలకు అవగాహన ప్రధానం: సీనియర్ సివిల్ జడ్జి
మహిళా చట్టాల పై మహిళలకు అవగాహన ప్రధానం:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి
పిల్లలకు బాల్యం లోనే విద్యా బుద్ధులు అలవాటు చేసి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే మహత్తర కార్యాన్ని అంగన్వాడీ టీచర్ లు నిర్వర్తిస్తున్నారని గౌ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఐ.కరుణకుమార్ తెలిపారు. శనివారం చిత్తూరు కొంగారెడ్డిపల్లి లోని ఐసిడిఎస్ కార్యాలయంలో మరియు గిరింపేట జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా అంగన్వాడీ టీచర్లతో మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ ఈ నెల 4 వ తేది నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళా చట్టాల పై మహిళలకు అవ గాహన ప్రధానమని, ఉపాద్యాయులు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు చిన్నతనంలోనే ఆటపాట లతో విద్యను పరిచయం చేస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మన దేశం లో మహిళల రక్షణ కొరకు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రం లో వన్ స్టాప్ సెంటర్ లు మరియు దిశా యాప్ ను మహిళల రక్షణ కొరకు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. మన దేశంలోని స్త్రీలకు సహనం ఎక్కువని, మహిళల కారణంగా సమాజంలో కుటుంబ వ్యవస్థ నిలబడుతోందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకోవడం కారణంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి సమాజం లో వారిని ముందుకు నడిపించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.