పోలింగ్ మెటీరియల్ ను ఆర్ డి ఓ లు, తహసీల్దార్లకు అందజేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
పోలింగ్ మెటీరియల్ ను ఆర్ డి ఓ లు, తహసీల్దార్లకు అందజేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
మార్చి 13న శాసనమండలి ఎన్నికల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలి పారు. శనివారం సాయం త్రం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎం ఎల్ సి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న జరగనున్న పోలింగ్ నిర్వహణ లో భాగంగా పోలింగ్ మెటీరియల్ ను జిల్లా జాయింట్ కలెక్టర్, ఎ ఆర్ ఓ మరియు డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, పోలింగ్ మెటీరియల్ పంపిణీ నోడల్ ఆఫీసర్ మరియు జెడ్పి సిఈఓప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆర్ డి ఓ లు,తహసీల్దా ర్ లకు పోలింగ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూమార్చి 13న నిర్వహించే ఎం ఎల్ సి పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎం ఎల్ సి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎ ఓ కుల శేఖర్, చిత్తూరు ఆర్డీఓ రేణుక, తహసిల్దార్లు పాల్గొన్నారు