18, మార్చి 2024, సోమవారం

బలిజలకు నమ్మక ద్రోహం చేసిన బాబు, జగన్


ఎన్నికల సీట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమకు తీరని ద్రోహం చేశారని జిల్లాలోని బలిజ సంఘం నేతలు ఆవేదన చెందుతున్నారు. తమను నమ్మించి  మోసం చేశారని అభిప్రాయ పడుతున్నారు. తొలినుంచి పార్టీలు తమ సేవలను వినియోగించుకుని చివరి నిమిషంలో పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు బలిజ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని భావిస్తున్నాను. రానున్న ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలని సంఘ నేతలు భావిస్తున్నారు. తమకు ద్రోహం చేసిన విధంగా ఎన్నికలలో తెలుగుదేశం, వైసిపి పార్టీలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలిజ సంఘం నేతలు ఏకమవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం గురించి పథక రచన చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు పార్టీలకు మాత్రం తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు.


తెలుగుదేశం పార్టీ తొలినుండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు స్థానాలను బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తోంది. గత ఎన్నికల్లో కూడా తిరుపతి, చిత్తూరు అసెంబ్లీ సీట్లను బలిజ కులస్తులకు  కేటాయించారు. రాజంపేట పార్లమెంటు సీటును డీకే ఆదికేశవులు సతీమణి డీకే సత్యప్రభకు కేటాయించారు. వైసిపి గాలిలో ముగ్గురు  అభ్యర్థులు ఓడిపోయారు. అయినా కూడా బలిజ సామాజిక వర్గం చాలా వరకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. తిరుపతిలో నియోజకవర్గ ఇన్చార్జిగా సుగుణమ్మ పార్టీ బరువు బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని ముందుకు నడిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ తొలినుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించారు. జనసేన పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అన్నా, టిడిపిలో ఆకాశం వస్తుందని ఆ ఆహ్వానాన్ని  తిరస్కరించారు. అలాగే మున్సిపల్ మాజీ మేయర్ కటారి హేమలత కూడా నగర పార్టీ అధ్యక్షురాలి హోదాలో పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. అత్తమామలను రాజకీయ కక్షల కారణంగా పోగొట్టుకున్నా, భర్త ప్రవీణ్ ను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకున్నా, గుండె డిటవు చేసుకుని పురుషులతో సమానంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన అనుచరుల మీద తప్పుడు కేసులు బనాయించారని పోలీసుల జీబుకు అడ్డంగా పడుకొని  ఆమె గాయపడ్డారు. గాయంతో కొద్ది రోజులు ఆస్పత్రిలో కూడా ఉన్నారు. 


అలాగే టీటీడీ మాజీ చైర్మన్, చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు కుమార్తె తేజస్విరి కూడా టికెట్ ఆశించారు. ఆమె కూడా ఆశావాహులతో పాటు వారం, పది రోజులు పాటు చిత్తూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో వ్యవహరించారు. చిత్తూరు టికెటును గత 20 సంవత్సరాలుగా బలిజ కులస్తులకు చంద్రబాబును కేటాయిస్తూ వచ్చారు. వారి ఆశలను నిరాశ చేస్తూ, సంప్రదాయానికి తిలోకదాకాలు ఇస్తూ, ఆరు నెలల కిందట టిడిపిలో క్రియాశీలకమైన గురజాల జగన్మోహన్ నాయుడుకు పార్టీ టికెట్ ఇచ్చారు. దీంతో చిత్తూరు పట్టణంలోని బలిజ సామాజిక వర్గం తీవ్ర నిరాశకు గురైంది. టికెట్ ను ఆశించిన ఒక మహిళ చంద్రబాబు తనను మోసం చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే పుంగనూరు నియోజకవర్గం సోమల సురేష్ కూడా ఈ పర్యాయం పుంగనూరు అసెంబ్లీ టికెట్ ను ఆశించారు. పార్టీ అధినేతను కలిసి తనకు పుంగనూరు టిక్కెట్టు కేటాయించాల్సిందిగా కోరారు. తనకు ప్రజారాజ్యం పార్టీలో, తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న కారణంగా తను విజయం సాధిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చల్లా బాబుకు టికెట్ కేటాయించారు.

వైసీపీ పార్టీ చిత్తూరు అసెంబ్లీ టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులకే అని   నమ్మ పలుకుతూ వచ్చింది. సాధికారత బస్సు యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన మంత్రుల బృందం తిరిగి జంగాలపల్లి శ్రీనివాసులకు టిక్కెట్టు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఊహించని విధంగా విజయానంద రెడ్డి తెర మీదికి వచ్చారు. చిత్తూరు టికెట్ కోసం పోటీపడ్డారు. అధిష్టానం పిలిపించి చిత్తూరు టికెట్టును విజయానంద రెడ్డి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే జంగాలపల్లి శ్రీనివాసులకు రాజ్యసభ ఖరారు చేస్తావని, ఏపీఐఐసీ చైర్మన్ గా నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాజ్యసభ విషయంలో మాట తప్పారు. అలాగే ఏపీఐఐసీ చైర్మన్ విషయంలో కూడా ముఖం చాటేశారు. దీంతో అసంతృప్తి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *