ప్రభుత్వ స్కూల్ స్వీపర్ల సమస్యలపై 17న విజయవాడలోధర్నా
ప్రభుత్వ స్కూల్ స్వీపర్ల సమస్యలపై 17న విజయవాడలోధర్నా
ఆం.ప్ర.ప్రభుత్వ స్కూల్ స్వీపర్ల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. జయ కుమారి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు ఆయాల సమస్యల పరిష్కారం కోసం మార్చి 17న విజయవాడలో జరిగే ధర్నాన్ని జయప్రదం కావాలని కోరుతూ గురువారం మంగసముద్రం హౌసింగ్ కాలనీలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ స్విపర్ల అండ్ ఆయాల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.జయ కుమారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు ఆయాల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి తప్పు పట్టారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా బాత్రూంలను పరిశుభ్రం చేస్తున్న స్వీపార్ల అయాల సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
108 జీవో ప్రకారం 11,500 వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, అమ్మ ఒడి పథకం నుండి కాకుండా ప్రత్యేకంగా టాయిలెట్ మెయింటినెన్స్ కింద బడ్జెట్ కేటాయించాలని, నెల నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డు మంజూరు చేయాలని చేసారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ,పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయాలను పెంచాలని, నీటి సౌకర్యం లేని చోట ననీ టి సౌకర్యాలు కల్పించాలని ,0 ఈఎస్ఐ,పి ఎఫ్ అమలు చేయాలని, స్లీపర్ లను ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ మార్చి 17న విజయవాడ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కే .రమాదేవి, మాజీ ఎంపీటీసీ ఎస్. సరళ దేవి, కే. ప్రభావతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.


