CK బాబు మళ్ళి క్రియాశీలకం కానున్నారా?
చిత్తూరు టైగర్, మాజీ ఎమ్మెల్యే పీకే బాబు తిరిగి క్రియాశీలకం కానున్నారా ? జరుగుతున్న సంఘటనలు అవునని సమాధానం ఇస్తున్నాయి. ఆదివారం ముఖ్య నేతలతో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే జీకే బాబు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు తన ముఖ్య అనుచరులను ఆహ్వానించారు. భవిష్యత్తులో రాజకీయంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం. భవిష్యత్తులో సీకే బాబు మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇంటికే పరిమితం అయిన CK బాబు శనివారం హఠాత్తుగా చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. తమ అనుచరుల మీద అక్రమ కేసులు బనాయించ కుండా అడ్డుకున్నారు. ఈ వార్త చిత్తూరులో సంచలనం లేపింది.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబును ఇటీవల తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బిజెపి, కాంగ్రెస్, భారత చైతన్య యువజన పార్టీ నాయకులు కలుస్తున్నారు. వారు తమ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే సీకే బాబు ఇప్పటివరకు తన మనసులోని మాటను బయట పెట్టలేదు. బిజెపి, కాంగ్రెస్, భారత చైతన్య యోజన పార్టీ పార్టీ నాయకులు సీకే బాబుని కలిసి పార్టీలో చేరి, రానున్న ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. అయితే సీకే బాబు చిత్తూరు తెలుగుదేశం పార్టీ టికెట్టును ఆశించినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్టు గురజాల జగన్మోహన్ నాయుడుకు అధిష్టానం కేటాయించింది. దీంతో భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం గురించి చర్చించడానికి ఆదివారం సికే బాబు తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశాలకు సంబంధించి అందరికీ సమాచారం ఇస్తుండగా శనివారం జయకుమార్, నారాయణరెడ్డి, షేరు, కుయ్యా, సూరి, సురేష్, శేఖర్ లను చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీకే బాబు హుటాహుటిన చిత్తూరు టు టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులతో మాట్లాడుతూ తన అనుచరులు రౌడీలు, గుండాలు కారన్నారు. వారి మీద ఇప్పటివరకు ఇటువంటి కేసులు లేవన్నారు. అనవసరంగా తమ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగితే సహించేది లేదన్నారు. దీంతో పోలీసులు సమాధానం ఇస్తూ ఎన్నికల ప్రక్రియలో భాగంగానే పలువురిని బైండోవర్ చేసుకుంటున్నామని తెలిపారు. ఎవరినీ అరెస్టు చేయడం లేదని, బైండోవర్ చేసుకొని విడుదల చేస్తున్నామని చెప్పారు. దీంతో సీకే బాబు వారిని తీసుకొని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్విక్త పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం తర్వాత సీకే బాబు పోలీస్ స్టేషన్ కి రావడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన పట్టణ ప్రజల్లో ఏర్పడింది. అయితే దీని వెనక ఒక అధికార పార్టీ నాయకుని హస్తం ఉందని తెలుస్తోంది. సీకే బాబు అనుచరులను మానసికంగా దెబ్బతీయడానికి బైండోవర్ పేరుతో వేధిస్తున్నారని భావిస్తున్నారు.
ఇటీవల చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్, MLC రాంగోపాల్ రెడ్డి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుని కలిశారు. ఏకాంతంగా చర్చలు జరిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాల్సిందిగా కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సీకే బాబుకు ఫోన్ చేసి తిరిగి క్రియాశీలకం కావాలని కోరినట్లు సమాచారం. అలాగే చిత్తూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ పార్టీ అభ్యర్థి విజయానికి ఉదాహదపడాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. వీటి కారణంగా సీకే బాబు ఆదివారం ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికలలో అనుసరించాల్చిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అర్ధాంతరంగా నీకే బాబుతో తమ సంబంధాలను తెంచుకుంది. సీకే బాబుకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని సీకే బాబు అభిమానులు భావిస్తున్నారు. తమను అవమానించిన పార్టీ మీద కక్ష్య సాధించాలన్న ధోరణి సీకే బాబు అనుచరగణంలో వ్యక్తం అవుతుంది. కావున రానున్న ఎన్నికలలో సీకే బాబు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి, టిడిపి అభ్యర్థి జగన్మోహన్ నాయుడు విజయానికి కృషి చేస్తారని టిడిపి నాయకులు ఆశాభావంతో ఉన్నారు.